TTD: తిరుమల అన్న ప్రసాదంలో కొత్త వంటకం.. ఖుషి లో భక్తులు ?


TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది టిటిడి పాలక మండలి. నిత్యం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు… అన్న ప్రసాదం అందిస్తుంది టీటీడీ పాలక మండలి. కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఇందులో పప్పు,చారు, మజ్జిగ అలాగే రైస్ అలాగే స్వీట్ తదితర ఐటమ్స్ పెడుతూ ఉంటారు.

New recipe in Tirumala Anna Prasadam

అయితే తాజాగా టీటీడీ పాలక మండలి అన్నప్రసాదం అందించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి భక్తులకు ప్రతిరోజు మసాలా వడా అదనంగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది టిటిడి పాలక మండలి. భక్తులకు సమృద్ధిగా ఆహారాన్ని అందించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్తగా టీటీడీ పాలక మండలి ఏర్పాటు అయిన నేపథ్యంలో.. కచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అందుకే తిరుమల భక్తులకు… వడ అందిస్తోంది. దీంతో ప్రతిరోజు 35 వేల వడలు… తిరుమలలో అవసరం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *