Heroines: హీరోయిన్లు ఆ డైరెక్టర్ తో ఆ పని చేస్తే ఇండస్ట్రీలో స్టార్స్ అవుతారా.?
Heroines: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ చాలా వరకు మారిపోయింది.. ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో కొంతమందికి స్టార్డం రాగానే దర్శక, నిర్మాతలనే బెదిరింపులకు గురి చేస్తున్నారు. కానీ 90sలో అలా ఉండేది కాదట.. ఎంత పెద్ద హీరో, హీరోయిన్ అయినా దర్శక నిర్మాతలకు భయపడే వారట.

Will Heroines become stars in the industry if they work with that director
వారు చెప్పింది చేసేవారట. ఒక్కోసారి దర్శకుల చేత తన్నులు కూడా తిన్న సందర్భాలు అనేకం ఉన్నాయని హీరో, హీరోయిన్లు చెప్పుకొస్తూ ఉంటారు.. అలా సిస్టమేటిక్ గా ఉన్నాము కాబట్టి ఈ పొజిషన్ కి మేము వచ్చామని అంటున్నారు.. ఇంతకీ హీరోయిన్లను కొట్టిన డైరెక్టర్ ఎవరయ్యా అంటే భారతిరాజా. ఈయన డైరెక్షన్ లో ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. (Heroines)
Also Read: Tamannaah: తమన్నా బ్రేకప్ వెనుక ఆ టాలీవుడ్ హీరో.. దగ్గరుండి చెడగొట్టాడుగా..?
ఇందులో చాలామంది స్టార్లుగా ఎదిగారు.. రేఖ, రేవతి, రాధిక, ప్రియమణి, రాధా, వంటి వారు ఉన్నారు. వీళ్లంతా భారతిరాజా చేతిలో తన్నులు తిన్నవారే..ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో వారే బయటపెట్టారు.. అయితే ఈ డైరెక్టర్ వాళ్ళందరినీ కొట్టడానికి ప్రధాన కారణం ఏడ్చే సన్నివేశాలు..ఈ సమయంలో ఏడ్చే సీన్ సరిగా రాకపోతే భారతి రాజాకు నచ్చదట..

అందుకే ఆయన హీరోయిన్లను ఏడ్చేలా చేయడం కోసం గట్టిగా చెంప మీద కొట్టేవారట. దీనివల్ల ఏడ్చేసి అద్భుతంగా పండి అభిమానులకు నచ్చుతుందని ఆయన అనుకునేవారట. అలా వీరందరూ భారతిరాజా చేతిలో తన్నులు తిని కన్నీళ్లు కార్చిన వారమే అంటూ చెప్పుకొచ్చారు.. ఆయన కొట్టాడు కాబట్టే ఆ సినిమాలు మంచి హిట్ అయిపోయి మేము స్టార్లుగా మారామని అన్నారు.(Heroines)