S.S. Rajamouli: భారతీయ సినిమా చరిత్రలో ఎస్.ఎస్. రాజమౌళి అనే పేరు ఒక విప్లవం. ఆయన రూపొందించిన ప్రతి సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక విజువల్ వండర్‌గా నిలుస్తుంది. ప్రతి ఫ్రేమ్‌లో ఒక అద్భుతమైన పనితనం కనిపిస్తుంది. కథ, కథనం, తారాగణం, సాంకేతికత – అన్నీ సమపాళ్లలో ఉంటాయి. అందుకే ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందాయి. “బాహుబలి”, “ఆర్ఆర్ఆర్” వంటి చిత్రాలు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. రాజమౌళి సినిమా అంటే ప్రతి చిన్న విషయాన్ని ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తారు. ప్రతి డిటైల్, ప్రతి సన్నివేశం ఆయన చేయూతలోనే ఉంటుంది.
The Secrets to S.S. Rajamouli Blockbuster Success
రాజమౌళి సినిమాలు భారీ తారాగణం, సాంకేతికతతో ఉంటాయి. అయినా, సినిమా చివరికి పూర్తి క్రెడిట్ మాత్రం రాజమౌళికే వెళుతుంది. అది ఆయన ప్రతిభకు, పర్ఫెక్షన్కు ప్రతీక. “జక్కన్న” అనే బిరుదు ఆయన సినిమాల్లో ప్రతిబింబిస్తే, ఆయన కథలపై ఉన్న పట్టుదల సాక్ష్యంగా నిలుస్తుంది. ఎంత పెద్ద స్టార్ అయినా, రాజమౌళి చేతుల్లో కథే ప్రధానమవుతుంది. ప్రేక్షకులు కూడా ఈ విధానం వల్ల ఆయన సినిమాలను ఆతృతగా ఎదురుచూస్తారు. ఆయన తీయబోయే ప్రతి సినిమా పట్ల అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది.
Also Read : Pushpa 2: ‘పుష్ప 2’ వాయిదా పాడబోతోందా… నిరాశలో ఫ్యాన్స్!!
కానీ, ఈ ఘనతకు వెనుక ఉన్న కష్టం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు రాజమౌళి, ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నైలో ఉన్నప్పుడు, వారి కుటుంబం రోజువారీ అవసరాలను కూడా పూర్తి చేయలేని స్థితిలో ఉండేది. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నప్పటికీ, డబ్బు అంతగా అందేది కాదు. ఒకసారి కూరగాయల దుకాణంలో అప్పు అడిగినప్పుడు దుకాణదారుడు అతనిని అవమానించడంతో రాజమౌళికి తీవ్రమైన బాధ కలిగింది. ఆ అవమానం ఆయన మనసులో ఎప్పటికీ ఉండిపోయింది.
అలాంటి కష్టాల నుంచి ఎదిగి, రాజమౌళి నేడు వందల కోట్ల బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే స్థాయికి వచ్చారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయం. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో కలిసి “SSMB29” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.