Health: చికెన్, మటన్ తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయవద్దు ?
Health: నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చాలామంది నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. చికెన్ లేదా మటన్ తినడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తారు. అంతేకాకుండా వారానికి రెండుసార్లు అయినా చికెన్ లేదా మటన్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ షాపుల ముందు బారులు తీరుతుంటారు. చికెన్ లేదా మటన్ శారీరక అభివృద్ధికి ఎంతగానో సహాయం చేస్తుంది. ముఖ్యంగా చికెన్ లో ఉండే ప్రోటీన్ కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

Never do these things after eating chicken and mutton
చికెన్ లేదా మటన్ తిన్న అనంతరం కొన్ని ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మటన్ లో కొవ్వులు అధికంగా ఉంటాయి. అయితే చాలామంది మటన్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగడానికి ఆసక్తిని చూపుతుంటారు. కానీ మటన్ తిన్న అనంతరం కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదట. వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు శరీరంలో అధికంగా పెరుగుతుంది. మటన్ తిన్న అనంతరం తేనే లేదా పాలు, టీ అస్సలు తాగకూడదని చెబుతున్నారు.
ఒకవేళ ఇవి తిన్నట్లయితే శరీరం అంతా విషపూరితంగా మారుతుందట. కొన్ని సందర్భాలలో ప్రాణానికి హాని ఏర్పడుతుంది. మటన్ లేదా చికెన్ తిన్న తర్వాత పాలు, పాల ఉత్పత్తులతో తయారుచేసిన తీపి పదార్థాలు అస్సలు తినకూడదు. దీని వలన జీర్ణ సమస్యలు వస్తాయి. అదే విధంగా నాన్ వెజ్ తిన్న తర్వాత తేనె కూడా తినకూడదు. ఇది మటన్, చికెన్ లాగానే శరీరంలో అధికంగా వేడిని పెంచుతుంది. కొన్నిసార్లు ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది.