Kiran Abbavaram: వాళ్ల కాపురంలో చిచ్చు పెడుతున్న కిరణ్ అబ్బవరం.. మాజీ లవర్ అంటూ..?
Kiran Abbavaram: ఏంటి కిరణ్ అబ్బవరం కాపురాల్లో చిచ్చులు పెడుతున్నారా..ఇంతకీ ఆయన కాపురంలో చిచ్చుపెట్టేలా ఏం మాట్లాడారు.. ఎందుకు కిరణ్ అబ్బవరం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.. యంగ్ హీరో గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం తన నటనతో ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అంతేకాదు క అనే మూవీ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.

Trolls on Kiran Abbavaram
అయితే అలాంటి కిరణ్ అబ్బవరం నటించిన తాజా మూవీ దిల్ రుబా.. ఈ సినిమా ఈ నెల 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దిల్ రుబా మూవీ కి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో స్టేజి మీద కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..ఈ సినిమాకి మీరు మీ లవర్ తో పాటు మీ ఎక్స్ లవర్ తో కూడా సినిమాకి వెళ్ళండి.అయితే కొంచెం కష్టమైనా పర్వాలేదు ఇది ఒకసారి ట్రై చేయండి. (Kiran Abbavaram)
Also Read: Prabhas: డైరెక్టర్ తో ప్రభాస్ గొడవలు.. ది రాజా సాబ్ రిలీజ్ కష్టమేనా.?
ఎందుకంటే ఈ సినిమా చూశాక మీ లవర్,మీ ఎక్స్ లవర్,మీరు ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాకుండా ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తారు. అయితే మీ ఎక్స్ లవర్ తో మీకు ప్రేమ పోయినప్పటికీ ఫ్రెండ్షిప్ మాత్రం అలాగే ఉంటుంది. ఈ సినిమా చూసి వచ్చాక మీ ఎక్స్ లవర్ తో ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తారు. ఒక మంచి సినిమా చూసాం అనే అనుభూతి కలుగుతుంది అంటూ మాట్లాడారు.

అయితే కిరణ్ అబ్బవరం మాటలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి.ఈయన మాటలపై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు..ఎక్స్ లవర్ అంటే వారికి కొంతమందికి పెళ్లిళ్లు అయిపోతాయి కావచ్చు. పెళ్లి అయిపోయాక మళ్ళీ వారి జీవితంలోకి వెళ్లి సినిమా చూద్దాం రా అని చెప్పి వారి జీవితాల్లో చిచ్చులు పెట్టుమంటావా.. వారి కాపురంలో నిప్పులు పోయమంటారా.. అంటూ కిరణ్ అబ్బవరం ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.(Kiran Abbavaram)