Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా దగ్గుబాటి.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.?
Rana Daggubati: ఏంటి రానా దగ్గుబాటి నిజంగానే తండ్రి కాబోతున్నారా.. పెళ్లయిన 5 ఏళ్లకు గుడ్ న్యూస్ చెబుతున్నారా.. ఇంతకీ రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారు అనే వార్తల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. రానా దగ్గుబాటి కరోనా సమయంలో అంటే 2020 ఆగస్టు 8న మిహికా బజాజ్ నీ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి కుటుంబ సభ్యుల మధ్యలో చాలా గ్రాండ్ గా జరిగింది. కరోనా సమయం కావడంతో వీరి పెళ్లికి చాలా మంది రాలేకపోయారు.

Rana Daggubati is going to become a father
అయితే అలాంటి రానా దగ్గుబాటి పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు పిల్లలకి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే చెప్పలేదు. చాలాసార్లు రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడు.మిహికా బజాజ్ తల్లి కాబోతుంది అని రూమర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఏదీ కూడా నిజం కాలేదు. ఇక రానా దగ్గుబాటి కంటే ముందు ఆయన తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి తండ్రయ్యాడు. (Rana Daggubati)
Also Read: Sridevi: శ్రీదేవి ఆ హీరోయిన్ల మీద కుళ్ళుతో అంతటి దారుణానికి ఒడిగట్టిందా.?
పెళ్లయిన ఏడాదికే దగ్గుబాటి అభిరామ్ తండ్రి అవ్వడంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఫీల్ అయింది. కానీ రానా కంటే ముందే తమ్ముడు చాలా ఫాస్ట్ అంటూ రానా పై ట్రోలింగ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే పిల్లలకు సంబంధించి వీరిద్దరూ ఓ నిర్ణయం తీసుకున్నాకే పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదని,బహుశా రామ్ చరణ్ ఉపాసన లాగే వీళ్ళు కూడా కొద్ది రోజులు వెయిట్ చేస్తారు కావచ్చు అని అందరూ అనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా సినీ ఇండస్ట్రీ నుండి రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడు అనే ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది.అయితే టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న న్యూస్ లో ఎంత నిజం ఉందో కానీ దగ్గుబాటి ఫ్యాన్స్ మాత్రం ఈ రూమర్ నిజం అవ్వాలని కోరుకుంటున్నారు. మరి నిజంగానే రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడా అనేది ఫ్యామిలీ క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.(Rana Daggubati)