IND VS NZ: ఫైనల్ మ్యాచ్ కు కోహ్లీ దూరం ?
IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Virat Kohli Suffers Injury Scare In Nets Ahead of Champions Trophy Final
దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య జరుగనుంది. ఈ తరుణంలోనే.. టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుకు స్వల్ప గాయం అయిందని ప్రచారం జరుగుతోంది. జియో న్యూస్ నివేదిక ప్రకారం, నెట్స్‌లో పేసర్‌ను ఎదుర్కొంటుండగా కోహ్లీ మోకాలికి గాయం కావడం జరిగిందట.
దీంతో ప్రాక్టీస్ ఆపేసి..డ్రెస్సింగ్ రూంకు వెళ్లాడట విరాట్ కోహ్లీ. అయితే… గాయం తీవ్ర తరం అయినట్లు చెబుతున్నారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ లో కోహ్లీ ఆడకపోతే… రిషబ్ పంత్ ఆడే ఛాన్స్ ఉందట.