Producer: ఆ డైరెక్టర్ కి 5 తులాల బంగారం ఇచ్చిన నిర్మాత.. ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటంటే..?
Producer: సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉండాలే కానీ ఎవరైనా గుర్తింపునిస్తారు అనేది కొంతమంది డైరెక్టర్లను చూస్తే అర్థమవుతుంది. సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే కొంతమంది వ్యక్తులు, దర్శకులు చేసే సినిమాలు సూపర్ హిట్ అయినా సందర్భాల్లో దర్శకులకు రకరకాల బహుమతులు ఇస్తూ ఉండడం చూస్తున్నాం. అయితే తాజాగా సినిమా కనీసం మొదలు కాకముందే కథ విన్న నిర్మాత ఐదు తులాల బంగారం గిఫ్ట్ గా ఇచ్చారట.

The Producer who gave 5 tolas of gold to that director
ఆ సినిమా ఏంటయ్యా అంటే త్రిష నటించిన సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి దర్శకుడు ప్రేమ్ కుమార్ విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన 96వ చిత్రం 2018 లో థియేటర్లలోకి వచ్చింది. సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ చిత్రాన్ని ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రేమ్ కుమార్ సీక్వెల్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.. (Producer)
Also Read: Star Hero: స్టార్ దంపతుల విడాకులు.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్.?
అయితే 96 మొదటి భాగంలో ప్రేమ కథ ఉందని ప్రస్తుతం తీయబోయే సినిమాలో ప్రేమ కథ ఉండదని డైరెక్టర్ చెప్పుకోచ్చారట. అయితే ఈ చిత్రానికి ఐసరి గణేష్ వేల్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. 96వ చిత్రం రెండో పార్ట్ కథ విన్నటువంటి నిర్మాత ఐసరి గణేష్ డైరెక్టర్ కు 5 తులాల బంగారం బహుమతిగా ఇచ్చారట.

ఇలాంటి కథ నా జీవితంలో ఎప్పుడు వినలేదు సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రెండో భాగం షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. రాబోయే ఈ చిత్రంలో హీరో విజయ్ సేతుపతి ఉంటారా లేదంటే వేరే తారాగణాన్ని తీసుకుంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Producer)