Team India: ఇప్పటివరకు టీమిండియాకు ఎన్ని ఐసీసీ ట్రోఫీలు వచ్చాయి ?
Team India: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విక్టరీ సాధించిన టీమిండియా చాంపియన్గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కు…. అందరూ అభినందనలు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా ఇప్పటివరకు ఎన్ని ఐసీసీ టోర్నమెంట్లు గెలుచుకుంది అనే దానిపై చర్చ జరుగుతోంది.

How many ICC trophies has Team India won so far
ఇప్పటివరకు… ఏడు ఐసీసీ మేజర్ టోర్నమెంట్లు గెలుచుకుంది టీమిండియా. 1983 సంవత్సరంలో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2002లో మరోసారి ఛాంపియన్గా నిలిచింది. టి20 వరల్డ్ కప్ 2007 సంవత్సరంలో ధోని సారథ్యంలో టీమిండియా చాంపియన్గా నిలిచింది.
అలాగే ధోని సారథ్యంలోనే వరల్డ్ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 కూడా వచ్చింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ లో t20 వరల్డ్ కప్ 2024 అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చింది. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నమెంటు రాకపోవడం… గమనార్హం. మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో మూడు ఐసీసీ టోర్నమెంట్లు వచ్చాయి. రోహిత్ శర్మ సారథ్యంలో రెండు మాత్రమే.