KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డా. దాసోజు శ్రవణ్ ?
KCR: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల చివర్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కు ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

BRS party chief KCR announces Dr. Dasoju Sravan’s name as MLC candidate
టిఆర్ఎస్ పార్టీ తరఫున.. ఒక సీటు గెలిచే ఛాన్స్ ఉంది. అందుకే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ను ప్రకటించారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడు… కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెంట దాదాపు 20 సంవత్సరాలు నడిచాడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. అలాగే మొన్న గవర్నర్ కోట సమయంలో కూడా దాసోజు శ్రవణ్ కు అన్యాయం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాసోజు శ్రవణ్ పేరును ప్రకటించారు కేసీఆర్.