TDP: చంద్రబాబుపై పిఠాపురం SVSN వర్మ తిరుగుబాటు ?
TDP: తెలుగుదేశం పార్టీపై పిఠాపురం వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కచ్చితంగా తనకు టికెట్ వస్తుందని పిఠాపురం వర్మ.. డిసైడ్ అయి ప్రచారం కూడా చేసేసుకున్నారు.

Pithapuram SVSN Varma revolts against Chandrababu
పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసినప్పుడే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని… గతంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆశతోనే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు పిఠాపురం వర్మ. అయితే ఈసారి… కచ్చితంగా వస్తుందని వర్మ అనుకున్నాడు. కానీ చివరికి పిఠాపురం వర్మ కు… షాక్ ఇస్తూ చంద్రబాబు మీరు మేం తీసుకున్నారు.
వర్మ కంటే జూనియర్లకు టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో పిఠాపురం వర్మ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన కారణంగానే తనకు టికెట్ రాలేదని… తన కార్యకర్తలతో చర్చించుకుంటున్నారట. భవిష్యత్తుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.