ODI retirement: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ఇస్తున్న ఆటగాళ్ళు వీరే.. కన్ఫర్మ్!!

ODI retirement: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా? గతంలో టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన అతను, ఇప్పుడు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన తర్వాత ఈ చర్చ మిన్నంటుతోంది. మ్యాచ్ అనంతరం దీనిపై స్పష్టత రానున్నట్లు భావిస్తున్నారు.
Ravindra Jadeja ODI retirement latest news
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకోగా, భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేక 251/7కే పరిమితమైంది. రవీంద్ర జడేజా తన 10 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 30 పరుగులు ఇచ్చి టామ్ లేథమ్‌ను ఔట్ చేశాడు. అయితే అతని బౌలింగ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ హగ్ ఇవ్వడం, ఈ అంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. కోహ్లీ-జడేజా హగ్ వెనుక రిటైర్మెంట్‌కు సంకేతాలున్నాయా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అంతకుముందు స్టీవ్ స్మిత్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఆటగాళ్లు కూడా రిటైర్మెంట్ ప్రకటనల ముందు కోహ్లీకి హగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో జడేజా కూడా అదే బాటలో వెళ్లనున్నాడా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం జడేజా తన భవిష్యత్తు గురించి ఏమైనా అధికారిక ప్రకటన చేస్తాడా? అనే ఆసక్తి పెరుగుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతను, 18 ఓవర్లలోనే టీమిండియాను 103 పరుగుల వద్ద నిలిపాడు. అయితే శాంట్నర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్, కోహ్లీ ఔట్ కావడంతో భారత్ 107/2 వద్ద నిలిచింది. చివరకు, ఈ మ్యాచ్ రవీంద్ర జడేజా చివరిదా? లేక అతను కొనసాగిస్తాడా? అన్నది మ్యాచ్ అనంతరం తేలిపోనుంది.
