Anushka Sharma: రోహిత్‌కు హగ్.. అనుష్క శర్మ ఫ్యామిలీ క్రికెట్ సెలబ్రేషన్స్!!

Anushka Sharma: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి మరో కీలక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ, రోహిత్ శర్మను హగ్ చేసి అభినందనలు తెలిపింది.
Anushka Sharma Congratulates Rohit After Win
ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా క్రికెటర్ల కుటుంబ సభ్యులు స్టేడియంలో హాజరయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా భార్యలు, పిల్లలు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్‌ను తిలకించారు. టీమిండియా గెలిచిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా తమ జీవిత భాగస్వాములను హగ్ చేసుకుని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
మ్యాచ్ చివరి నిమిషాల్లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే, డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ సహచరులతో కలిసి సంబరాల్లో మునిగిపోయాడు. అనంతరం, రోహిత్, విరాట్ కోహ్లి గ్రౌండ్లో హగ్ చేసుకుని, ఆనందం వ్యక్తం చేశారు. రోహిత్ తన భార్య రితికాను హగ్ చేసుకోవడంతో పాటు తన కుమార్తె సమైరాను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న అనుష్క శర్మ కూడా రోహిత్ శర్మకు హగ్ ఇచ్చి అభినందనలు తెలిపింది.
విరాట్ కోహ్లి మ్యాచ్ గెలిచిన వెంటనే భార్య అనుష్క శర్మను టైట్ హగ్ చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ క్షణాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. విరాట్ తన విజయాలను అనుష్కతో ఎక్కువగా పంచుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదే విధంగా, రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టి తన భార్య వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని వచ్చిన వార్తలను ఖండిస్తూ, రోహిత్ తాము ఇంకా వన్డే క్రికెట్ ఆడతామని స్పష్టం చేశాడు.