Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కోరికను తీర్చిన జైలు అధికారులు.. మెత్తటి దిండు, దుప్పటి తో పాటు!!

Vallabhaneni Vamsi: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన జైలు బ్యారక్ మార్పు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. జైలు అధికారులు భద్రతా కారణాల రీత్యా వంశీ బ్యారక్ మార్పు కుదరదని కోర్టుకు తెలిపారు. అయితే మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ చేసిన అభ్యర్థనను మాత్రం జైలు అధికారులు అంగీకరించారు.
Vallabhaneni Vamsi Requests Jail Transfer
ఇక వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తరఫు న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు రోజుల గడువు కోరారు. కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. అంతేకాకుండా వంశీని మరో 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో మూడురోజుల కస్టడీలో వంశీ పూర్తిగా సహకరించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు.
సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు వ్యవహారం వల్లభనేని వంశీ ఆధ్వర్యంలోనే జరిగిందని పోలీసులు కోర్టుకు వివరించారు. వంశీ నుండి మరింత సమాచారం రాబట్టేందుకు 10 రోజుల కస్టడీ అవసరమని కోర్టులో వాదించారు. గతంలో సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలు చూపించినప్పటికీ వంశీ సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ఈ కేసులో న్యాయస్థానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. వంశీని మరో పది రోజులు కస్టడీకి ఇస్తారా లేదా అనే అంశంపై కోర్టు త్వరలో తీర్పు ఇవ్వనుంది. ఇదే సమయంలో వంశీ బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉండటంతో ఆయన రిమాండ్లో మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముంది.