Sobhita: ఆ హీరోతో శోభిత రొమాన్స్.. సమంత చేసిన తప్పే చేయబోతుందా.?
Sobhita: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న కుటుంబాల్లో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. ఈ కుటుంబం నుంచి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎంట్రీ ఇచ్చి గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ గా ఎదిగాడు.. ఇక వీరిలో మూడవ తరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్డం కోసం ఎదురుచూస్తున్నారు..

Sobhita romance with that hero
నాగచైతన్య అయితే ఓ మోస్తరుగా దూసుకుపోతున్న అఖిల్ మాత్రం పూర్తిగా డల్ అయిపోయారు. సినిమాల విషయాన్ని పక్కన పెడితే నాగచైతన్య ముందుగా హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్నారు.. వీరి సంసార జీవితం కొన్ని సంవత్సరాలపాటు చాలా సాఫీగా సాగింది. తర్వాత ఏమైందో ఏమో వీరి మధ్య కలతలు పుట్టి విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి నాగచైతన్య శోభితతో ప్రేమలో పడి సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు.. (Sobhita)
Also Read: Soundarya: సౌందర్యని ఆస్తుల కోసమే ఆ హీరో హత్య చేయించాడా..?
అలా కొన్నాళ్లపాటు మైంటైన్ చేసి, చివరికి వీరి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబాలకు చెప్పి పెళ్లి ద్వారా ఒకటయ్యారు. దీంతో శోభిత ధూళిపాల తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది.. అయితే శోభిత పెళ్లి తర్వాత సినిమాలు పూర్తిగా ఆపేసి వ్యాపారాలు చూసుకుంటుందని అందరూ భావించారట. కానీ ఈమె అనూహ్యంగా సినిమాలు వదిలే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చిందట..

మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించబోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్స్ అంత పెద్దింట్లోకి కోడలిగా వెళ్లి మళ్లీ సినిమాల్లో రొమాన్స్ లు చేస్తావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత కూడా పెళ్లి అయిన తర్వాత మెగా హీరో రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో నటించింది. ఆ విధంగానే శోభిత కూడా పెళ్లి తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ తో నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..(Sobhita)