Rohit Kohli : వీరి భారం ఇంకెన్నాళ్ళు.. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వరా? ఈ విషయం లో ధోని నే కరెక్ట్!!


Rohit, Kohli Eye 2027 World Cup

Rohit Kohli: టీమిండియా ఇటీవల 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌ను ఫైనల్‌లో ఓడించి ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు అభిమానుల్లో సంబరాలు తెచ్చింది. అయితే ఈ విజయంతో పాటు సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma) మరియు విరాట్ కోహ్లీ (Virat Kohli) వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారనే వదంతులు షికారు చేశాయి.

Rohit, Kohli Eye 2027 World Cup

అయితే ఈ విషయంపై రోహిత్ శర్మ స్పష్టతనిచ్చారు. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, తాను వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోనని తెలిపారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో విరాట్ కోహ్లీ ఒక సెంచరీ (Century) మరియు ఒక హాఫ్ సెంచరీ (Half-Century)తో అద్భుతంగా రాణించగా, రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. ఫామ్ కోల్పోయారని విమర్శలు ఎదుర్కొన్న ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ ప్రతిభను మరోసారి చాటారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డేల్లో కొనసాగనున్నారని స్పష్టత రావడంతో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) మరియు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) మరికొంత కాలం తమ అవకాశం కోసం వేచి చూడాల్సి వస్తుంది. అభిమానులు ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలు 2027 ప్రపంచ కప్ వరకూ ఆడాలని కోరుకుంటున్నారు. Social Media లో కూడా వీరు మరో ప్రపంచకప్ గెలిపించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

https://twitter.com/pakkafilmy007/status/1600352362639822848

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *