![Another record in Prabhas account](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/prabhas-1-1024x576.jpg)
![Another record in Prabhas account](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/prabhas-1-1024x576.jpg)
Prabhas: టాలీవుడ్ లో ఏ రికార్డు అయినా సరే ప్రభాస్ ఖాతాలో పడాల్సిందే.. డార్లింగ్ ఖాతాలో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు పడ్డాయి.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోనే మొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ పేరుగాంచారు.అయితే అలాంటి హీరో తాజాగా వచ్చిన కల్కి 2898 AD మూవీతో మరో రికార్డు క్రియేట్ చేసిన మొదటి భారతీయ హీరో.అయితే ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్ ని తక్కువ చేసేది.
Another record in Prabhas account
కానీ ఇప్పుడు ఆ బాలీవుడ్ లో నటించే స్టార్ హీరో హీరోయిన్లే టాలీవుడ్ దర్శకులు చేసే సినిమాల్లో నటిస్తున్నారు. అలా టాలీవుడ్ ఆ స్థాయికి ఎదిగింది అంటే దానికి ప్రధాన కారణం రాజమౌళి అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రభాస్ క్రియేట్ చేసిన ఆ రికార్డు ఏంటా అనుకుంటున్నారా ప్రభాస్ నటించిన వరుసగా ఐదు సినిమాలు ఓపెనింగ్స్ రోజే 100 కోట్లకు పైగా భారీ వసూళ్లను కలెక్ట్ చేశాయి.(Prabhas)
Also Read: Kalki 2898 AD: కల్కి హిట్.. చంపేస్తామంటూ వార్నింగ్.. మొహం చాటేసిన వేణు స్వామి..!
అలా వరుసగా 5 సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసిన హీరోగా ప్రభాస్ ఇండియాలోనే మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ విషయంలో ప్రభాస్ ని ఢీకొట్టే హీరోనే ఇండియాలో లేడు అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రభాస్ నటించిన బాహుబలి 2 మూవీ 217 కోట్లు వసూలు చేస్తే,ఆ తర్వాత వచ్చిన సాహో మూవీ ఫ్లాప్ అయినా కూడా 130 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.
![Another record in Prabhas account](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/Another-record-in-Prabhas-account-1024x576.jpg)
![Another record in Prabhas account](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/Another-record-in-Prabhas-account-1024x576.jpg)
ఇక ఆ తర్వాత రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ డిజాస్టర్ అయినా కూడా మొదటి రోజే 140 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇక గత ఏడాది వచ్చిన సలార్ మూవీ మొదటి రోజే 178 కోట్లు వసూలు చేసింది.ఇక తాజాగా విడుదలైన కల్కి మూవీ 180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఇండియాలోనే ఈ రికార్డు క్రియేట్ చేసిన మొదటి హీరోగా ప్రభాస్ పేరుగాంచారు.(Prabhas)