Rajendra Prasad : ఎన్టీఆర్ పై రాజేంద్రప్రసాద్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఎన్టీఆర్ ఇంట్లోనే రాజేంద్రప్రసాద్ జననం!!


Rajendra Prasad : ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో జన్మించానని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

Rajendra Prasad Childhood in NTR Home

ఆయన మాట్లాడుతూ, “నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇల్లు చిన్న మేడతో కూడిన పెంకుటిల్లు. మా నాన్నగారు స్కూల్ టీచర్‌గా పనిచేసేవారు. ఆయన బదిలీ కారణంగా మా కుటుంబం ఆ ఊరికి వెళ్లింది. మేము ఎన్టీఆర్ గారి ఇంటి పెంకుటిల్లు లో దాదాపు 24 సంవత్సరాలు నివాసం ఉన్నాము. ఈ కాలంలో ఎన్టీఆర్ గారి కుటుంబంతో మా అనుబంధం మరింత బలపడింది,” అని తెలిపారు.

తన జన్మ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ రాజేంద్రప్రసాద్ అన్నారు: “నా అమ్మ పురిటి నొప్పులతో బాధపడుతున్న సమయంలో తెల్లవారుజామున మూడు గంటలకు గేదె అరుస్తుండగా, మా అమ్మ గడ్డి తెచ్చేందుకు వెళ్లింది. అదే సమయంలో నొప్పులు పెరగడంతో అక్కడే పడిపోయింది. అప్పుడు ఎన్టీఆర్ గారి తల్లి వెంకట్రావమ్మ గారు మా అమ్మను ఆదుకున్నారు. ఆమె గొప్ప తల్లి. ఎన్టీఆర్ గారి తల్లి చేతులమీదుగానే నేను జన్మించాను,” అని భావోద్వేగంగా తెలిపారు.

ఈ విధంగా రాజేంద్రప్రసాద్ తన జీవితంలో ఎన్టీఆర్ కుటుంబం ఎంత ప్రత్యేకమో వివరించారు. ఆయన చెప్పిన ఈ ఆప్తమైన కథ ప్రేక్షకుల మనసును హత్తుకుంది.

https://twitter.com/pakkafilmy007/status/1600352362639822848

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *