Amla: ఒక్క ఉసిరితో అధిక బరువు, షుగర్‌తో పాటు ఈ సమస్యలన్నింటికీ ?
Amla: ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యానికి ప్రయోజనాలు పోషకాలు ఎన్నో ఉంటాయి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాల్షియం, ఐరన్, పొటాషియం, పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉసిరి తినడం వల్ల ఆరోగ్యంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి.

Health Benefits With Amla
ప్రతిరోజు ఉసిరి తిన్నట్లయితే రోగనిరోధక శక్తి బలపడుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. తద్వారా జబ్బు పడకుండా ఉంటారు. ఉసిరికాయను ప్రతిరోజు తిన్నట్లయితే జుట్టు, చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల ఒక నెలలోనే జుట్టు రాలడం తగ్గిపోయి బలంగా, ఒత్తుగా తయారవుతుంది.
ప్రతి రోజు ఉసిరి తినడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దానివల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉసిరి చాలా మంచిది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఇది మంచి ఆహారం. ఉసిరి ప్రతిరోజు తిన్నట్లయితే హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కాబట్టి దీనిని తింటే రక్తహీనత సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి చాలా మంచిది.