Sleeping: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలంటే ఎలా ?


Sleeping: పడుకున్న వెంటనే చాలా మందికి నిద్ర పట్టదు. కొంతమంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరికొంతమందికి పడుకున్న వెంటనే నిద్ర పడుతుంది. రోజువారి పనిలో భాగంగా అలసట, నీరసం వల్ల నిద్రపోరు. మరి కొంతమంది అతి తక్కువ సమయంలోనే నిద్రపోతారు. మరి కొంతమంది ఎంత పని చేసిన ఒత్తిడికి గురైన అలసట, నీరసం ఉన్నప్పటికీ నిద్రపోరు.

How to fall asleep immediately after going to bed

అయితే పడుకున్న వెంటనే నిద్ర పోవాలంటే కొన్ని రకాల సూచనలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…. ప్రతిరోజు సాయంత్రం సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు. అలా తాగినట్లయితే నిద్ర అసలు పట్టదు. ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేసినట్లయితే బ్రెయిన్, బాడీ సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటుంది.

నిద్రపోవడానికి ముందు కాసేపు రిలాక్స్ అవ్వాలి. అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేసినట్లయితే కండరాలు రిలాక్స్ అవుతాయి. దానివల్ల సులభంగా నిద్ర పడుతుంది. రాత్రి సమయంలో ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. అలా తిన్నట్లయితే నిద్ర తొందరగా పట్టదు. అంతేకాకుండా సాయంత్రం సమయంలో కడుపులో చల్లగా ఉండే ఆహార పదార్థాలను తిన్నట్లయితే నిద్ర సులభంగా పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *