KCR: కేసీఆర్ జీతం వెంటనే ఆపేయండి?


KCR: గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీతభత్యాలు వెంటనే నిలిపివేయాలంటూ… అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లేఖ రాశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ అసెంబ్లీకి రాకుండానే కల్వకుంట్ల చంద్రశేఖర రావు జీతం తీసుకుంటున్నాడని కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు.

Letter to Assembly Speaker Gaddam Prasad, requesting immediate suspension of salary and allowances of KCR

వెంటనే ఆయన జీతాలు… ఆపేయాలని కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లేఖ రాయడం జరిగింది కాంగ్రెస్ కార్పోరేటర్ రాజశేఖర్. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై గులాబీ సోషల్ మీడియా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. గత కొన్ని రోజులుగా సచివాలయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావడం లేదని.. అతని జీతం కూడా కట్ చేయాలని డిమాండ్ చేస్తుంది గులాబీ పార్టీ సోషల్ మీడియా.

ముఖ్యంగా 39 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మండిపడుతోంది. 39సార్లు ఢిల్లీకి వెళ్లినందుకుగాను… ఆయన జీతం కట్ చేయాలని డిమాండ్ చేస్తుంది గులాబీ పార్టీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *