Krishna: Sr.ఎన్టీఆర్ ని అవమానించి అందరిముందు కృష్ణ హీరో అనిపించుకున్నారా.?

Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదటి స్థానంలో ఉంటారు. అయితే వీరి తర్వాత కాస్త అటు ఇటుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉంటారు. అలా ఈ ముగ్గురు ఇండస్ట్రీలో ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేసిన గొప్ప వీరులని చెప్పవచ్చు. ఇక ఇండస్ట్రీలో కొనసాగుతూ రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తుల్లో మాత్రం ఎన్టీఆరే మొదటి స్థానంలో ఉన్నారు.
Krishna Insult Sr NTR
ఈయన కేవలం హీరో గానే కాకుండా రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా కూడా చేశారు.. అలా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఏ నటుడు కూడా ఎదురు చెప్పేవారు కాదట. కానీ సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా సినిమాలు తీస్తూ సెటైర్లు వేసేవారట. ఒకానొక సమయంలో ఒక వేదికపై డైరెక్ట్ గా ఎన్టీఆర్ కు విళ్లెక్కుపెట్టినట్టు ఒక విషయాన్ని అందరి ముందు ప్రస్తావించారు. ఆయన ఆరోజు అడిగాడు కాబట్టే ప్రస్తుతం ఎంతోమంది హీరోలు ఈ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన ఏమన్నారు వివరాలు చూద్దాం..(Krishna)
1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. ఆయన పాలన విధానాన్ని కేవలం కృష్ణ మాత్రమే వ్యతిరేకించారు. అంతే కాదు ఆయన వ్యతిరేకంగా చాలా సినిమాలు కూడా తీశారు. ఆ విధంగా ఎన్టీఆర్ కృష్ణమధ్య అప్పట్లో కోల్డ్ వార్ ఉండేది. అయితే ఒకానొక సమయంలో హైదరాబాద్ వేదికగా ఒక పెద్ద సభ జరిగింది. ఈ సభకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. అంతేకాదు సినీ ప్రముఖులు అంతా ఈ సభలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ప్రత్యేక నమస్కారాలు..

గత 15 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు రావాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది పూర్తిస్థాయిలో జరగడం లేదు, చిత్ర పరిశ్రమ గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన అన్న ఎన్టీఆర్ హయాంలోని హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ రావాలని నేను కోరుకుంటున్నానని తన ప్రసంగాన్ని ముగించారు. ఈ విధంగా కృష్ణ కోరుకున్నట్టుగానే హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ తరలివచ్చింది. దీంతో ఆనాడు కృష్ణ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఇండస్ట్రీలో ఇంతమంది బతుకుతున్నారు అంటే అది కృష్ణ వల్లే అని కామెంట్స్ పెడుతున్నారు.(Krishna)