Sreeleela: ఆ హీరోతో శ్రీలీల పెళ్లి ఫిక్స్.. నిజం బయటపెట్టిన హీరో తల్లి.?

Sreeleela: శ్రీ లీలా ఈమె పేరులోనే ఏదో తెలియని మత్తు ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్ లో అతి తక్కువ వయసు కలిగిన హీరోయిన్ ఎవరయ్యా అంటే చాలామందికి శ్రీ లీలా మాత్రమే గుర్తుకొస్తుంది.. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఫ్లాప్ అయినా శ్రీ లీలా నటన మాత్రం అందరి గుండెల్లో నిలిచిపోయింది.
Sreeleela marriage with that hero
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు తన్నుకుంటూ వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలు అందరితో నటించే అవకాశం లభిస్తుంది. అలాంటి ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ నటుడితో డేటింగ్ లో ఉందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే కార్తీక్ ఆర్యన్.. ఈయన శ్రీ లీలా డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది..దీనికి ప్రధాన కారణం ఆమెను ఫ్యామిలీ ఫంక్షన్ కి ఆహ్వానించి ప్రత్యేకంగా ట్రీట్ చేశారట. ( Sreeleela)
Also Read: Payal Rajputh: పాయల్ రాజ్ పుత్ ని హింసించిన చేసిన నిర్మాత.?
దీంతో వీరి మధ్య ఏదో ఉందని బీ టౌన్ లో వార్తలు ఉన్నాయి. దీనికి తోడు కార్తీక్ ఆర్యన్ తల్లి ఐఫా వేడుకల్లో పాల్గొని మీకు కాబోయే కోడలు ఏ విధంగా ఉండాలని కరణ్ జోహార్ ప్రశ్నించగా దానికి చాలా ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చింది. నా ఇంటికి రాబోయే కోడలు ఒక వైద్యురాలు అయి ఉండాలని చెప్పింది.. ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా రాణిస్తూ ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న నటి శ్రీలీలా మాత్రమే.. అంతేకాకుండా వీరిద్దరూ ఈ మధ్యకాలంలో డేటింగ్ లో ఉన్నారంటూ ఒక ప్రచారం కూడా సాగుతోంది..

ఇవన్నీ చూస్తే మాత్రం కార్తీక్ ఆర్యన్ తల్లి శ్రీలీలను మనసులో పెట్టుకొని ఇలా వ్యాఖ్యలు చేసిందంటూ పలువురు అనుమాన పడుతున్నారు.. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో అనురాగ్ బస్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా చేయడం మరో విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందని కొంతమంది అంటూ ఉంటే మరి కొంతమంది వారి మధ్య స్నేహం మాత్రమే ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనా వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని సోషల్ మీడియాలో కథనాలు ఊపందుకున్నాయి.( Sreeleela)