Bandi Sanjay: మోదీపై బండి సంజయ్ పాట.. ప్రశంసల జల్లు.. బీజేపీ కార్యకర్తల హర్షం!!


Bandi Sanjay Sings Modi Devotional Song

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనలోని గాయకుడిని బయటపెట్టారు. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూ, ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసే సంజయ్… ఇప్పుడు తన గాత్రాన్ని ఉపయోగించి ఓ పాట పాడి ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాది క్రితం విడుదలైన ‘నమో.. నమో.. నరేంద్ర మోదీ’ పాటను ఓ రికార్డింగ్ స్టూడియోలో హుషారుగా ఆలపించారు.

Bandi Sanjay Sings Modi Devotional Song

‘నమో.. నమో.. నరేంద్ర మోదీ.. పలుకుతున్నది యువత నాడీ.. ప్రధానిగా తమరే కావాలని.. అంటున్నది మన భరతజాతి..’ అంటూ ఆయన పాడిన ఈ పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బండి సంజయ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఈ పాటను తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తూ ఆయన గాత్రానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గతంలోనూ బండి సంజయ్ ఓ వేదికపై పాట పాడి అలరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంజయ్, తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఈ భూమి బిడ్డలం హిందువుల మందరం…’ అంటూ ఓ శ్రావ్యమైన పాటను ఆలపించి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు.

ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా గతేడాది శ్రీరామనవమి సందర్భంగా ‘హిందువుగా పుట్టాలి.. హిందువుగా బతకాలి.. హిందువుగా చావాలిరా’ అనే పాట పాడి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

https://twitter.com/i/status/1899904094971568479

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *