Chicken: ప్రతి రోజూ చికెన్ ఆరోగ్యమేనా ?


Chicken: చాలామంది వారానికి రెండు మూడు సార్లు తప్పకుండా నాన్ వెజ్ తింటారు. మాంసాహారం లేనిదే కొంతమందికి రోజు కూడా గడవదు. ఇక మరికొంతమంది వారానికి ఒకసారి మాత్రమే మాంసాహారం తింటూ ఉంటారు. అందులో ముఖ్యంగా చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. దానిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చికెన్ తింటారు. కొంతమంది చికెన్ అప్పుడప్పుడు మాత్రమే తింటుంటే మరికొంతమంది ప్రతిరోజూ చికెన్ తో వివిధ రకాల వంటకాలు చేసుకొని తింటూ ఉంటారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్, చికెన్ 65, చికెన్ పకోడా ఇలా వివిధ రకాలుగా చికెన్ వండుకొని తింటూ ఉంటారు.

health benfits with Chicken

అయితే ప్రతిరోజు చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే సందేహంలో చాలామంది ఉంటారు. అయితే దాని గురించి తెలుసుకుందాం. చికెన్ లో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు చికెన్ తినడం అస్సలు మంచిది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు చికెన్ తిన్నట్లయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు సంభవిస్తాయట. చికెన్ ఎక్కువగా తిన్నట్లయితే శరీరంలో యూరిక్ యాసిడ్ అనే పదార్థం అధికంగా విడుదల అవుతుంది. దానివల్ల శరీరంలో అనేక రకాల మార్పులు సంభవిస్తాయి. బరువు పెరగడం, అలర్జీ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ప్రతిరోజు చికెన్ తినడం వల్ల గుండె జబ్బులు, గుండె సంబంధిత సమస్యలు వెలువడతాయి. ఎందుకంటే చికెన్ లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది.

ఇది రక్తపోటును పెంచుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా చికెన్ తినకూడదు. దానివల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు రావడమే కాకుండా ఆలయం చుట్టూ అధికంగా కొవ్వు పేరుకు పోతుంది. చికెన్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అయితే అధికంగా చికెన్ తినడం వల్ల శరీరానికి ప్రోటీన్స్ ఎక్కువగా చేరుతాయి. దానివల్ల మూత్ర సంబంధిత వ్యాధులు వెలువడే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చికెన్ అసలు తినకూడదు. చికెన్ శరీరానికి వేడి చేస్తుంది. దానివల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాకుండా చికెన్ తినడం వల్ల కడుపులోని బిడ్డ పరిమాణం తగ్గుతుంది. వారంలో ఒకసారి మాత్రమే చికెన్ తినాలని అంతకుమించి తిన్నట్లయితే అనారోగ్యం బారిన పడతామని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *