Health: పాలతో కలిపి అరటి పండు తింటే ఏమవుతుంది ?
Health: అరటిపండు ఇది చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. అదేవిధంగా తియ్యగా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఒక అరటిపండు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అరటి పండులో అనేక రకాల ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటి పండులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లన్నీ ఉంటాయి. అంతేకాకుండా అరటి పండులో చక్కెర, కాల్షియం, కొవ్వు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా అరటి పండులో విటమిన్ సి, బి6, బి12 వంటి పోషకాలు ఉంటాయి. చాలామంది అరటిపండును వివిధ రకాల జ్యూస్ లు చేసుకొని తాగుతూ ఉంటారు.

What happens if you eat a banana mixed with milk
అది ఎంతో రుచిగాను, శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. అరటి పండు ప్రతిరోజు తిన్నట్లయితే సులభంగా బరువు పెరుగుతారు. బరువు తక్కువగా ఉన్నవారు అరటి పండును తిన్నట్లయితే అతి వేగంగా బరువు పెరుగుతారు. అయితే అరటి పండును పాలతో కలిపి తీసుకోవడం మంచిదేనా కాదా అని ప్రతి ఒక్కరికి చిన్న డౌట్ ఉంటుంది. అరటిపండును పాలతో కలిపి తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదట. అంతే కాకుండా ఈ రెండు కలిపి తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అందుతాయి. అయితే ఈ రెండింటిని ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకున్నట్లయితే చాలా మంచిది. అరటి పండులో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండును తినకపోవడమే మంచిది.
అలర్జీ, స్కిన్ సమస్యలతో బాధపడేవారు అరటిపండు తినకూడదు. అలాంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండును తిన్నట్లయితే ఎలర్జీ సమస్యలు ఎక్కువవుతాయి. చిన్నపిల్లలకు అరటిపండుతో తయారుచేసిన ఆహార పదార్థాలను తినిపించినట్లయితే వారి శరీరానికి కావలసిన విటమిన్లు అందుతాయి. అంతేకాకుండా వారు బరువు పెరగడానికి అరటిపండు చక్కగా పనిచేస్తుంది. ప్రతిరోజు చిన్నపిల్లలకు ఒక అరటి పండును తప్పకుండా తినిపించాలి. అంతేకాకుండా స్మూతీస్ రూపంలో కూడా తినిపించాలి. అలా చేసినట్లయితే చిన్నపిల్లల ఎదుగుదల బాగుంటుంది. ఇక ప్రతి ఒక్కరూ ఉదయం లేదా సాయంత్రం ఒక అరటి పండు తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది.