Dil Ruba Movie Review: కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ మూవీ రివ్యూ!!

మూవీ : ‘దిల్ రుబా’ Dil Ruba Movie Review
నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సర్ దిల్లాన్, క్యాథీ డేవిసన్, సత్య, ఆడుకాలమ్ నరేన్, జాన్ విజయ్ తదితరులు
దర్శకత్వం: విశ్వ కరుణ్
నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ
మ్యూజిక్: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: డేనియల్ విశ్వాస్
విడుదల తేదీ: 14-03-2025
Kiran Abbavaram Dil Ruba Movie Review
కథ : సిద్ధార్థ రెడ్డి (కిరణ్ అబ్బవరం) మ్యాగీ (నజియా డేవిసన్)ను ప్రేమిస్తాడు, కానీ ఆమె అమెరికా వెళ్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఈ ఘటనతో అమ్మాయిలపై అసహ్యం పెంచుకున్న సిద్ధూ, తండ్రి మరణంతో “థాంక్స్, సారీ” అనే మాటలు వాడకూడదని నిర్ణయించుకుంటాడు. అతని జీవితంలో అంజలి (రుక్సార్) ప్రవేశించి ప్రేమలో పడేలా చేస్తుంది. కానీ విక్కీ (క్రాంతి కిల్లి) కారణంగా ఇద్దరూ విడిపోతారు. బ్రేకప్ గిల్ట్లో ఉన్న మ్యాగీ వీరిని కలిపేందుకు వస్తుంది. లోకల్ డాన్ జోకర్ (జాన్ విజయ్) ఎందుకు సిద్ధూ బ్యాచ్‌ను టార్గెట్ చేశాడు? వీరు చివరికి ఒక్కటయ్యారా? తెలుసుకోవాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే.
నటీనటులు: ‘క’ సినిమా తో ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో తన మాస్ యాంగిల్‌ను పూర్తిగా ప్రోజెక్టు చేసుకున్నాడు. ముఖ్యంగా స్టైలింగ్, బాడీ లాంగ్వేజ్ విషయంలో కొత్తదనం చూపిస్తూ, మరింత స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకున్న కేర్ అతని ప్రెజెన్స్‌ను ఎలివేట్ చేసింది. నటన పరంగా కొంతవరకు పూరీ జగన్నాధ్ హీరోల మేనరిజమ్ కనిపించినా, యూత్‌కు కనెక్ట్ అయ్యే పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు.
అంజలి పాత్రలో రుక్సార్ ఎనర్జిటిక్‌గా కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో లిప్ సింక్ మిస్ అయినా, నటిగా మంచి మార్కులు సంపాదించింది. ఆమె కెరీర్‌కు ఈ సినిమా పాజిటివ్ వైబ్ ఇవ్వడం ఖాయం. మరో కీలకపాత్రలో క్యాతీ డావిన్సన్ ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, ఆమె పాత్ర అంతగా వర్కౌట్ కాలేదు.
కమెడియన్ సత్య, విలన్ జాన్ విజయ్‌లను సరైన రీతిలో వినియోగించుకోకపోవడం కొంతవరకు మైనస్‌గా మారింది. క్రాంతి కిల్లి స్టైలిష్ విలన్‌గా కనిపించేందుకు ప్రయత్నించాడు. అయితే, అతని పాత్రను మరింత బలంగా డిజైన్ చేస్తే మరింత ప్రభావం చూపేదనిపిస్తుంది. మొత్తంగా, ఈ సినిమా కిరణ్ అబ్బవరం స్టైలింగ్, యూత్‌ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
సాంకేతిక నిపుణులు: విజువల్స్ అందంగా, కెమెరా వర్క్ రిచ్‌గా ఉన్నాయి. డేనియరల్ విశ్వాస్ సినిమాటోగ్రఫి విజువల్ పరంగా మెప్పించేలా ఉంది ఫైట్స్ స్టైలిష్‌గా రూపొందించగా, ఖర్చు విషయంలో కాంప్రమైజ్ చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని డైలాగ్స్ గుండెల్ని తాకేలా ఉన్నాయి. బలమైన కథ, ఎమోషనల్ కంటెంట్ సినిమాకు ప్రధాన హైలైట్. సినిమా గ్రాండియర్ లుక్‌తో ఉంది, కథాపరంగా ఎమోషన్స్ బాగా పండాయి. సీఎస్ సామ్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది. పాటలు ఆకట్టుకోగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ వాల్యూస్. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాణ విలువల విషయంలో కాంప్రమైజ్ చేయలేదు. గ్రాండియర్ విజువల్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
ప్లస్ పాయింట్స్:
కిరణ్ అబ్బవరం
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా నెమ్మదితనం
తీర్పు: దిల్ రూబా ఫాదర్ సెంటిమెంట్, లవ్, ఎమోషనల్ అంశాలతో మేళవించిన కమర్షియల్ ఎంటర్టైనర్. కిరణ్ అబ్బవరం మార్క్, స్టైలిష్ టేకింగ్ బలంగా కనిపిస్తాయి. కథ ఇంకా బెటర్‌గా ఉంటే ఫలితం మెరుగైనదిగా అనిపించేదీ. మాస్, లవ్ స్టోరీలను ఆస్వాదించేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్.
రేటింగ్: 3/5