Papaya: వేసవిలో బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో.. ?
Papaya: వేసవిలో చాలామంది ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ, ద్రాక్ష వంటి పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ద్రాక్ష, పుచ్చకాయ డయాబెటిస్ బాధితులు చాలా తక్కువ మోతాదులో మాత్రమే తినాలి. ఎక్కువగా తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ సులభంగా బొప్పాయిని తీసుకోవడం చాలా మంచిది. బొప్పాయి తినడానికి రుచితో పాటు శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఆహారంలో బొప్పాయి పండును చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ఆహార ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా బొప్పాయి ఆకులను జ్యూస్ తయారు చేసుకుని తాగినట్లయితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బొప్పాయి విత్తనాలను సైతం అనేక రకాల వ్యాధులను తొలగించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. బొప్పాయి తిన్నట్లయితే పేగులు శుభ్రం అవుతాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. బొప్పాయి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాలేయంలోని విషతుల్య పదార్థాలను సైతం నివారిస్తుంది. బొప్పాయి తిన్నట్లయితే శరీరంలోని రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. మెదడు, నాడి సంబంధిత సమస్యలను సులభంగా నివారిస్తుంది.

Summer fruit watermelon BENEFITS
డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో బొప్పాయి పండు తినడం చాలా మంచిది. బొప్పాయి పండు తినడం వల్ల నాడీ, వెన్ను సంబంధ సమస్యలు తొలగిపోతాయి. బొప్పాయి తినడం వల్ల చర్మం పైన ఉన్న అలర్జీలు తొలగిపోతాయి. మొటిమలు మటుమాయమవుతాయి. దీనిని తిన్నట్లయితే పేగులు సాఫీగా శుభమవుతాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు రెండు, మూడు బొప్పాయి ముక్కలను తీసుకోవడం చాలా మంచిది.
బొప్పాయిని తినడానికి ఇష్టపడని వారు జ్యూస్ రూపంలో తయారు చేసుకుని తాగిన ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు బొప్పాయి పండు జ్యూస్ అస్సలు తాగిపించకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే వేడి స్వభావం కారణంగా చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గర్భిణీ స్త్రీలు కూడా బొప్పాయిని తినడం శ్రేయస్కరం కాదు. దీనిని తిన్నట్లయితే కడుపులోని బిడ్డ తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండుకు చాలా దూరంగా ఉండాలి. డైట్ కొనసాగించేవారు బొప్పాయి పండును ప్రతి రోజు తిన్నట్లయితే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. దానివల్ల సులభంగా బరువు తగ్గుతారు.