Abbas love story with that heroine

Abbas: హీరో అబ్బాస్ అంటే 90’స్ లో ఉండే సినీ ప్రేక్షకులకు ఇష్టమైన హీరో.. యూత్ ఫేవరెట్ హీరోగా ఉన్న అబ్బాస్ కి అప్పట్లో ఎంతో ఫాలోయింగ్ ఉండేది. అంతేకాదు ఆయన కటింగ్,డ్రెస్ స్టైల్ ఇలా అన్ని సెన్సేషన్.. అప్పట్లో అబ్బాస్ కటింగ్ అంటే ఎంతో మంది యూత్ చాలా ఇష్టంగా చేయించుకునేవారు. ఇక అబ్బాస్ కి సంబంధించిన ప్రతి స్టైల్ ని అప్పటి యూత్ కచ్చితంగా ఫాలో అయ్యేవారు.

Abbas love story with that heroine

అలా అప్పటి యూత్ ఫేవరెట్ గా ఉన్న అబ్బాస్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. కానీ అబ్బాస్ మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ డబ్బు ఇస్తే ఏ పాత్రలో అయినా చేసిన అబ్బాస్ సినీ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈయన సినిమాలో అవకాశాలు తగ్గాక న్యూజిలాండ్ వెళ్లి అక్కడ కొద్దిరోజులు మెకానిక్ గా పని చేసి ఆ తర్వాత ఓ 10,15 రోజులు పెట్రోల్ బంక్ లో కూడా పని చేస్తారట.(Abbas)

Also Read: Aishwarya Rai: హృతిక్ రోషన్ తో ఐశ్వర్య రెండో పెళ్లి.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజం.?

ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ న్యూజిలాండ్ లో ఉన్నప్పటికీ ఆయన మాత్రం చెన్నైకి వచ్చారు. అయితే అవకాశం వస్తే మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట.ఇదంతా పక్కన పెడితే అప్పట్లో అబ్బాస్ లవ్ స్టోరీ టాలీవుడ్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

Abbas love story with that heroine

అదేంటంటే అబ్బాస్ హీరోయిన్ టబుతో ప్రేమదేశం సినిమా చేసే సమయంలో ప్రేమలో పడిపోయారట. కానీ అప్పటికే టబూ అజయ్ దేవగణ్ తో రిలేషన్ లో ఉండడంతో ఆమె ఎక్కువగా పట్టించుకోలేదట.కానీ అబ్బాస్ మాత్రం ఆమెని చాలా ప్రేమించారట. అయితే ఈ విషయం టబు కి చెప్పకుండానే అజయ్ దేవగన్ మీద టబు కి ఉన్న ప్రేమ తెలుసుకొని అబ్బాస్ సైలెంట్ అయిపోయారట.అలా ఈయన ప్రేమ వన్ సైడ్ లవ్ గా మిగిలిపోయింది.(Abbas)