Prabhas: తమన్నా ఫ్రెండ్ తో ప్రభాస్ పెళ్లి.. ముద్దు పెట్టుకున్న ఫొటోస్ వైరల్.?

Prabhas: ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమేనా..తమన్నా బెస్ట్ ఫ్రెండ్ ని ప్రభాస్ పెళ్లాడబోతున్నారా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలో ఉన్న నిజమేంత..నిజంగానే ఆ అమ్మాయికి ప్రభాస్ ముద్దు పెట్టారా అనే షాకింగ్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా రోజుల నుండి ప్రభాస్ పెళ్లి వార్తలు వినిపించడమే తప్ప జరిగింది లేదు మనం చూసింది లేదు.
Prabhas wedding with Tamannaah friend
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా చాలాసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలపై గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ అది జరగడం లేదు.ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు సినిమాల్లో తప్ప బయట ఏ హీరోయిన్ కి కూడా ముద్దుపెట్టినట్టు ప్రభాస్ ఫోటోలు వైరల్ అవ్వలేదు. ( Prabhas)
Also Read: Soundarya Case: సౌందర్య ఆస్తిని దోచుకున్న మోహన్ బాబు.. సౌందర్య భర్త రియాక్షన్!!
కానీ సడన్గా ప్రభాస్ ఓ అమ్మాయికి ముద్దుపెట్టిన ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.అయితే ఇవి ఏఐ ఫొటోస్ అనుకుంటే పొరపడినట్లే.ఎందుకంటే ఇవి ఏఐ ఫొటోస్ కాదు. నిజంగానే ప్రభాస్ ఆ అమ్మాయికి ముద్దు పెట్టారు.ఇక ప్రభాస్ లుక్ చూస్తే అది బాహుబలి సినిమా టైంలో లుక్ అని క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రభాస్ ముద్దు పెట్టిన ఆ అమ్మాయి అనుష్క నేనా,ఆమె ఫోటోని తీసేసి వేరే అమ్మాయి ఫోటో ని అందులో క్రియేట్ చేశారని కొంతమంది అనుకుంటున్నారు. కానీ అది కూడా తప్పే.

అయితే ప్రభాస్ ముద్దు పెట్టిన ఆ అమ్మాయి ఎవరో కాదు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ బిల్లీ మాణిక్.ఈమె తమన్నా బెస్ట్ ఫ్రెండ్ కూడా.. అయితే ఈ ఫొటోస్ బాహుబలి సినిమా సమయంలోవని తెలుస్తోంది.మరి అంత క్లోజ్ గా ఆ అమ్మాయికి ముద్దు పెట్టాల్సిన అవసరం ఏం వచ్చింది అని చాలామంది అవనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ ప్రభాస్ కి బిల్లీ మాణిక్ కి మధ్య మంచి స్నేహం ఉందట.అయితే ఆ అమ్మాయికి ముద్దు పెట్టింది కూడా స్నేహం తోనే కానీ వేరే ఏదో ఉద్దేశంతో కాదు అని తెలుస్తోంది.( Prabhas)