David Warner: డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనం సృష్టించాడు. వార్నర్ కు ఆరేళ్ల తర్వాత ఊరట లభించింది. 2018 సంవత్సరంలో శాండ్ పేపర్ కుంభకోణం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ పై ఏ స్థాయిలోనైనా జట్టుకు కెప్టెన్ గా ఉండకుండా జీవితకాల నాయకత్వ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అతడు దీని నుంచి ఉపశమనాన్ని పొందాడు. David Warner

Australia Lift Ban On David Warner

ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. అతని నాయకత్వంపై జీవితకాలం నిషేధాన్ని తొలగించింది. అయితే వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టి20 లీగ్ లలో ఆడుతున్నాడు. ఈ నిషేధాన్ని తీసేయడంతో అతను రాబోయే బీబీఎల్ సీజన్ లో సిడ్నీ తండర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. David Warner

Also Read: KTR: పొంగులేటివి పొలిటికల్ బాంబులు కాదు.. తుస్సు బాంబులు ?

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన వార్నర్ ఈనెల ప్రారంభంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్ ముందు హాజరు అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలియజేసింది. పరిమితుల నిబంధనలను సవరించడం కోసం అతను తన వాదనలను వారికి సమర్పించాడు. అలాగే సుల్లివన్, జెన్ సి రైట్, జెఫ్ గ్లిసన్ లతో కూడిన ప్యానెల్ ఏకగ్రీవంగా వార్నర్ 2018 నిషేధాన్ని ఎత్తివేయడానికి అన్ని ప్రమాణాలకు అనుకూలంగా అనుగుణంగా ఉన్నట్లుగా గుర్తించారు. David Warner