Parvati Nair: తప్పంతా నాదే.. అర్జున్ రెడ్డి సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్.?

Parvati Nair who made shocking comments on Arjun Reddy movie

Parvati Nair: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల కోసం అనుకున్న పాత్రలు మిస్ అయ్యి మరొకరికి వెళ్తూ ఉంటాయి. కొంతమంది కథలు విని నచ్చక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అబ్బా చేతులారా మిస్ చేసుకున్నామని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ పార్వతీ నాయర్..

Parvati Nair who made shocking comments on Arjun Reddy movie

ఈమె అర్జున్ రెడ్డి సినిమాను చేతులారా మీరు చేసుకుందట. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది.. ఇంస్టాగ్రామ్ వేదికగా జరిగినటువంటి సోషల్ మీడియా ఇంట్రాక్షన్ లో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా గురించి పార్వతి నాయర్ ని నెటిజన్లు ప్రశ్నించారు.. మీరు ఆ సినిమాను మిస్ చేసుకొని ఫీల్ అవుతున్నారు నిజమేనా అని అడిగారు. (Parvati Nair)

Also Read: Pushpa-2: పుష్ప-2 లో బాబాయ్ అంటూ పుష్పరాజ్ ని పిలిచిన ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

అప్పుడు పార్వతీ నాయర్ అర్జున్ రెడ్డి ఒక మంచి సినిమా.. నేను మిస్ చేసుకోకుండా ఉండాల్సింది.. అది మనదే అని రాసిపెట్టి ఉంటే తప్పకుండా మనకు వస్తుంది..అయితే ఈ సినిమా స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సింపుల్ గా ఉందని వద్దని చెప్పాను. కానీ డెబ్యూ డైరెక్టర్ కు ఇంత టాలెంట్ ఉంటుందని నేను ఊహించలేకపోయాను.

Parvati Nair who made shocking comments on Arjun Reddy movie

కానీ ఈ సినిమాను నేను థియేటర్లో చూసినప్పుడు అబ్బా ఊరికే మిస్ చేసుకున్నానే నా దురదృష్టం అంటూ చాలా బాధపడ్డాను. సాధారణ లవ్ స్టోరీని చాలా డిఫరెంట్ గా మార్చి చూపించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఆయన డైరెక్షన్ చూసి నేను ఆశ్చర్య పోయాను..ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు ఎంతో బాధపడ్డాను అని చెప్పింది ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.(Parvati Nair)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *