Parthiban: చచ్చే వరకు సీతనే నా భార్య.. ఆమె మాత్రం మరో పెళ్లి..?

Parthiban: పార్థిబన్ అంటే తెలుగు వారికి తెలియకపోవచ్చు. కానీ తమిళంలో ఫేమస్ డైరెక్టర్ కమ్ హీరో కం ప్రొడ్యూసర్… ఈయన కేవలం హీరో గానే కాకుండా వాళ్ళ సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు కొన్ని సినిమాలను నిర్మించారు కూడా.. అలాగే కొన్ని పాటలను స్వయంగా పాడి సింగర్ గా మారడంతో పాటు రచయితగా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. అలా మల్టీ టాలెంటెడ్ గా ఉన్న పార్థిబన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికీ సీతనే నా భార్య అంటూ సంచలన కామెంట్లు చేశారు.
Parthiban shocking comments on seetha
సీనియర్ నటి సీత పేరు చెబితే తెలియకపోవచ్చు. కానీ ఆ ఫేస్ చూస్తే చాలామంది గుర్తుపడతారు. అయితే సీత ఇప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరో హీరోయిన్లకు తల్లి అత్త పాత్రలో చేస్తుంది. కానీ అప్పట్లో ఈమె స్టార్ హీరోయిన్. ఇక సీత గురించి తొందరగా గుర్తుకు రావాలంటే అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది.. అయితే అలాంటి సీత మొదట పార్థిబన్ డైరెక్షన్లో పుదియ పాడై అనే సినిమాతో హీరోయిన్గా మారింది. అయితే ఈ సినిమా సీత వల్లే హిట్ అయింది అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పార్థిబన్ చెప్పుకొచ్చారు. (Parthiban)
Also Read: Nayanthara: నయనతారకు ఘోర అవమానం.. నీ మొహానికి ఇది అవసరమా అంటూ.?
ఆయన మాట్లాడుతూ..నేను ఈ సినిమా తీశాక సీతతో ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత సీతను పెళ్లి చేసుకున్నాను. పెళ్లయ్యాక సీత సినిమాల్లో నటించమంటే నో చెప్పింది. కానీ ఆ తర్వాత ఆమెనే మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. ఇక మా పెళ్లి అయిన కొద్ది రోజులకే మా మధ్య గొడవలు వచ్చి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. విడిపోయాక సీత మరో పెళ్లి చేసుకుంది. కానీ నేను విడాకులై 24 సంవత్సరాలైనా కూడా మళ్లీ పెళ్లి చేసుకోలేదు.ఎందుకంటే నా భార్య ప్లేస్ లో సీతను తప్ప మరొకరిని ఊహించుకోలేను.

అందుకే ఇప్పటికి సింగిల్గానే ఉన్నాను. మా అమ్మాయిలు ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. కానీ నా కొడుకు కూడా నాలాగే ఇంకా సింగిల్ గా ఉన్నాడు. ప్రస్తుతం నేను సీతతో టచ్ లో లేకపోయినప్పటికీ ఆమె తల్లి మరణించిన టైమ్ లో మాత్రం అంత్యక్రియలకు వెళ్లి దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాను. అంటూ పార్థిబన్ చెప్పుకొచ్చారు.ఇక పార్థిబన్ సీతాల వివాహం 1990లో జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్లకే వీళ్ళు విడాకులు తీసుకున్నారు.అలా 2001లో విడాకులయ్యాక సీత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.కానీ ఆ వ్యక్తికి కూడా సీత విడాకులు ఇచ్చినట్టు ఆ మధ్యకాలంలో రూమర్లు వినిపించాయి.(Parthiban)