Venkatesh: ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిల్ని లవ్ లో పడేసిన వెంకటేష్.?

Venkatesh: ఏంటి వెంకటేష్ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని లవ్ లో పడేసారా అని అనుకుంటారు ఈ విషయం తెలియని చాలామంది.మరి ఇంతకీ వెంకటేష్ కి సంబంధించి ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని లవ్ లో పడేయడానికి వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని లవ్ లో పడేసాడు అంటే రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. అసలు విషయం ఏమిటంటే.
Venkatesh made engaged girls fall in love
వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఈ రెండు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ రెండు సినిమాలలో హీరోయిన్లకు మొదటగా పెళ్లి ఫిక్స్ అవుతుంది కానీ పెళ్లి ఫిక్స్ అయిన హీరోయిన్లని వెంకటేష్ లవ్ లో పడేస్తారు. అలా ఎంగేజ్మెంట్ అయిన హీరోయిన్స్ వెంకటేష్ లవ్ లో పడేశారు.అలాగే ఈ రెండు సినిమాలలో ఉన్న మరో కామన్ పాయింట్ హీరోయిన్లు వెంకటేష్ తో ప్రేమలో పడిపోతారు. కానీ తర్వాత విభేదాలు వస్తాయి. (Venkatesh)
Also Read: Parthiban: చచ్చే వరకు సీతనే నా భార్య.. ఆమె మాత్రం మరో పెళ్లి..?
ఆ తర్వాత మళ్లీ ఫ్యామిలీ వాళ్ళే వీరిద్దరిని పెళ్లి బంధంతో ఒకటి చేస్తారు. అలా నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ కి ఎంగేజ్మెంట్ అయ్యాక ఇద్దరు ప్రేమలో పడతారు.ఆ తర్వాత గొడవపడతారు. మళ్లీ చివరికి ప్రకాష్ రాజ్ వీరిద్దరిని కలుపుతారు. అలాగే ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో త్రిషకి ముందుగానే పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత వెంకీ ప్రేమిస్తాడు. అయితే ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలియదు.అది కూడా తన స్నేహితుడితో అని తెలిసాక బాధపడతాడు.వెంకటేష్ తండ్రి చనిపోవడంతో తన స్నేహితుడు ఇంటికి తీసుకువెళ్తాడు.

ఆ టైంలో వెంకీ త్రిష మధ్య మరింత బాండింగ్ పెరుగుతుంది. ఆ తర్వాత వీరిద్దరినీ కూడా ఫ్యామిలీ వాళ్ళే ఒక్కటి చేస్తారు. అలా ఈ రెండు సినిమాలలో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం చివరికి ఫ్యామిలీ ఒప్పుకోవడం వంటి కామన్ పాయింట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒక మీమ్ వైరల్ అవుతుంది. అదేంటంటే సింగిల్ గా ఉండే అమ్మాయిల్ని ఎవడైనా ప్రేమలో పడేస్తాడు. కానీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిలని ప్రేమలో పడేయడం వేరే లెవల్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.(Venkatesh)