Cm Revanth Reddy: గుమ్మడి నర్సయ్య దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి ?
Cm Revanth Reddy: గుమ్మడి నర్సయ్య దెబ్బకు దిగివచ్చాడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. గతంలో అపాయింట్ మెంట్ ఇవ్వలేదు..కానీ తాజాగా గుమ్మడి నర్సయ్యకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇచ్చారు. కొన్ని వారాల క్రితం రేవంత్‌ను కలవడానికి వచ్చారు గుమ్మడి నర్సయ్య. ఖమ్మం నుంచి…. రేవంత్‌ను కలవడానికి హైదరాబాద్ కు వచ్చారు గుమ్మడి నర్సయ్య.

Telangana State CM Revanth Reddy summoned Gummadi Narsayya and met him
KTR: కేటీఆర్ ను కలిసిన తీన్మార్ మల్లన్న ?
అయితే… గుమ్మడి నర్సయ్యని అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కలువలేదట. బిజీ షెడ్యూల్ కారణంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదట తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇంటి దగ్గరకు వెళ్లినా, కార్ నుండి చూస్తూ.. చూడనట్టు వెళ్లిపోయిన రేవంత్ పై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించడం పట్ల నిరసన గళం వినిపించారు గుమ్మడి నర్సయ్య. Telangana State CM Revanth Reddy summoned Gummadi Narsayya and met him
Telangana: తులం బంగారం, మహిళలకు రూ.2500 ఇవ్వలేం ?
ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేను నిర్లక్ష్యం చెయ్యడంపై సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి. గుమ్మడిని కలవకపోవడంపై వచ్చిన వ్యతిరేకతతో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి… కాస్త దిగివచ్చారు. గుమ్మడి నర్సయ్య ను పిలిపించుకుని మరీ కలిసారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. దీంతో.. ఈ వివాదానాకి చెక్ పెట్టారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు గ్రేట్ సీఎం అంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసలు వస్తున్నాయి.
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి కి మరో ఎదురు దెబ్బ…?