Mumait Khan: బెడ్ రూమ్ లో చేసిన ఆ పనితో నా జీవితం నాశనం..?

Mumait Khan: ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే ఒకే ఒక్క పాటతో టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది నటి ముమైత్ ఖాన్.. అప్పట్లో ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ముమైత్ ఖాన్ పలు సినిమాల్లో కీ రోల్స్ కూడా చేసింది.అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది.
Mumait Khan shocking comments
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె మళ్ళీ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గా హైదరాబాదులో వీ లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ ని స్టార్ట్ చేసింది.(Mumait Khan)
Also read: RGV: అమ్మాయిల్లో అవే మత్తెక్కిస్తాయి.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవి..?
ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటినుండి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలు బయట పెడుతుంది. ఇందులో భాగంగా తనకి జరిగిన ఒక ఇన్సిడెంట్ చెబుతూ.. నేను ఇంట్లో డాన్స్ చేస్తుండగా కాల్ స్లిప్ పై పడిపోయాను. ఆ టైంలో బెడ్ నా తలకి గట్టిగా తగిలింది. రక్తం చుక్కకూడా బయటికి రాలేదు.కానీ నా తలలో ఏదో అయింది అని అనుమానం వచ్చి అమ్మను హాస్పిటల్ కి తీసుకువెళ్ళమన్నాను.

హాస్పిటల్ కి వెళ్ళగానే మూడు నరాలు కట్ అయ్యాయని చెప్పారు. ఆ తర్వాత 15 రోజులు కోమాలో ఉన్నాను. కోమాలో నుండి బయటపడ్డాక చాలావరకు విషయాలు మర్చిపోయాను.మెమొరీ లాస్ అయింది. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకుందాం అంటే ఒత్తిడి పెరుగుతుంది అంటూ తన జీవితంలో జరిగిన ఓ విషయం గురించి ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది.(Mumait Khan)