KTR: దేశాలు దాటినా పోలీసులను వదిలిపెట్టను ?
KTR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వరుసగా గులాబీ పార్టీ కార్యకర్తలు అలాగే నేతలను అక్రమ కేసుల్లో పోలీసులు అరెస్టు చేస్తున్నారని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్న గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ఈ సందర్భంగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.

KTR omments on telangana police
అక్రమంగా గులాబీ పార్టీ నేతలు అలాగే కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్న వారిపై చర్యలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసులు పెట్టి అరెస్టు చేసే పోలీసులను టార్గెట్ చేసి.. వాళ్ల పేర్లు రాసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. త్వరలోనే గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని… అప్పుడు ఆ పోలీసులపై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామన్నారు.
Also Read: Rajendra Prasad: ఒరేయ్ దొంగా అంటూ స్టార్ క్రికెటర్ ని స్టేజ్ మీదే తిట్టిన రాజేంద్రప్రసాద్.?
దేశం బదిలీ పారిపోయిన పోలీసు అధికారులను కూడా తెలంగాణకు తీసుకువచ్చి… చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు కేటీఆర్. తన తండ్రి కెసిఆర్ చాలా మంచివారు… కానీ నేను మంచివాన్ని కాదని కేటీఆర్ పేర్కొన్నారు. అందరి భరతం పడతానని హెచ్చరించారు.
Also Read: Heroine: తమిళ హీరోతో బ్రేకప్.. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. ఫొటోస్ వైరల్.?