Samantha: అందరూ అనుకుందే జరిగింది.. రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్.?

Samantha: ఏంటి సమంత రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుందా. ఇదెక్కడి విడ్డూరం..ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు అని ఈ విషయం తెలిసిన చాలా మంది చెవులు కొరుక్కుంటారు.. అయితే సమంత రహస్య ఎంగేజ్మెంట్ వార్తలు ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా బయటపడలేదు. కానీ కొన్ని రూమర్లైతే తెలుగు చిత్ర సినిమా పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి.
Samantha secret engagement
దానికి ప్రధాన కారణం గత కొద్దిరోజులుగా సమంత తన చేతికి ఒక డైమండ్ రింగ్ ని ధరించడమే. అయితే ఎప్పుడైతే రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయో ఆ తర్వాత కొద్ది రోజుల నుండే సమంత చేతి వేలికి ఈ డైమండ్ రింగ్ ఉండడంతో సమంత రాజ్ నిడిమోరు ఇద్దరు కలిసి రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. (Samantha)
Also Read: Venu Swamy: ఆ పొలిటీషియన్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం ఖాయం.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.?
అంతేకాదు రీసెంట్గా పికిల్ బాల్ కాంపిటీషన్లో పాల్గొన్న సమయంలో కూడా సమంత తనతో పాటు డైరెక్టర్ రాజ్ ని కూడా వెంటబెట్టుకొని వచ్చింది. అలాగే ఆ పికిల్ బాల్ పోటీ జరిగే సమయంలో సమంత రాజ్ చేతులు పట్టుకొని ఒక భర్తని కాబోయే భర్తని ఎలా అయితే వ్యవహరిస్తారో అలాగే వ్యవహరించింది. అలాగే రీసెంట్గా ఓ పార్టీలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు.

ఇక సమంత డేటింగ్ చేస్తుంది అని వార్తలు వినిపించినప్పటికీ కూడా డైరెక్టర్ తో సమంత ప్రయాణం కొనసాగిస్తుంది అంటే కచ్చితంగా అనుమాన పడాల్సిన విషయమే ఉంది. అలాగే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్టు కూడా రూమర్లు వినిపిస్తున్నాయి మరి రహస్య ఎంగేజ్మెంట్ పై సమంత ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.(Samantha)