Bhuvneshwar Kumar: SRH ఓనర్ కావ్యాకు ఝలక్ ఇచ్చిన భువనేశ్వర్ ?
Bhuvneshwar Kumar: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ ఈసారి ఆర్సిబి తరఫున బరిలోకి దిగనున్నాడు. మెగా వేలంలో 10 కోట్లకు భువనేశ్వర్ కుమార్ ను ఆర్సిబి కొనుగోలు చేసుకుంది. అయితే ఐపీఎల్ కు ముందు భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొన్నారు. ఈ టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న భువనేశ్వర్ హ్యాట్రిక్ వికెట్లతో తన సత్తాను చాటుకున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ఉత్తరప్రదేశ్-జార్ఖండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. Bhuvneshwar Kumar
RCB’s Rs 10.75 Crore Buy Bhuvneshwar Kumar Stuns With Hat-trick In Elite BCCI Tournament
ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 1.50 ఎకానమీతో 65 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. తన స్వింగ్ మాయాజాలంతో జార్ఖండ్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచి పరుగులను ఆరికట్టాడు. 17వ ఓవర్ వేసిన భువనేశ్వర్ వరుసగా వివేకానంద్ తివారి, రాబిన్ వంటి ఇతర ఆటగాళ్లను పెవిలియన్ కు పంపాడు. ఈ సీజన్ లో హ్యాట్రిక్ సాధించిన నాలుగవ బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ గెలిచాడు. ఇంతకుముందు ఆకాష్ మధ్వన్, శ్రేయస్ గోపాల్, అలే మావో కూడా ఈ ఘనతను సాధించారు. అంతకుముందు ఈ టోర్నీలో భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. Bhuvneshwar Kumar
Also Read: Couple Love: కొత్తగా పెళ్లయిన వారు… ఈ టిప్స్ పాటిస్తే… పండగే ?
బుమ్రాను అధిగమించి 300 టీ 20 వికెట్లను తీసిన తొలి భారత ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. అతని పేరు మీద 181 ఐపీఎల్ వికెట్లు, 90 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ దాటిగా బౌలింగ్ చేయడంతో ఉత్తరప్రదేశ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇదిలా ఉండగా…. భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన పైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ ను వదులుకొని సన్రైజర్స్ హైదరాబాద్ తల పట్టుకుంటుంది. 2016-17 సీజన్ లో భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ దక్కించుకోగా…. 2016 లో సన్రైజర్స్ టైటిల్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. Bhuvneshwar Kumar