Katrina Kaif: పిల్లల విషయంలో కత్రినా కి.. పిల్లలు పుట్టరా.. షాకింగ్ న్యూస్ వైరల్.?

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మల్లీశ్వరి మూవీ తో తెలుగు చిత్రసీమ పరిశ్రమ అంటే ఇష్టపడిన అభిమానులకు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.మల్లీశ్వరి మూవీలో తన యాక్టింగ్ తో వెంకీ సరసన ఓ రేంజ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే అలాంటి ఈ హీరోయిన్ బాలీవుడ్ లో స్టార్ నటి అనే సంగతి మనకు తెలిసిందే. అయితే అప్పట్లో రామానాయుడు తన కొడుకు వెంకటేష్ కోసం బాలీవుడ్ హీరోయిన్లను కూడా సౌత్ ఇండస్ట్రీకి తీసుకువచ్చాడు.
Trolls on Katrina Kaif
అలా బాలీవుడ్ స్టార్ లందరూ సౌత్ లో రాణించారు. అయితే అలాంటి కత్రినా కైఫ్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికీ చాలా బిజీగా గడుపుతుంది.అయితే ఈమె సినీ కెరీర్ బాగున్నప్పటికీ వ్యక్తిగత జీవితంపై చాలా రోజుల నుండి ట్రోల్స్ ఎదురవుతున్న సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా కత్రినా కైఫ్ పెళ్లి చేసుకొని నాలుగేళ్లు అవుతుంది. ఇప్పటికి కూడా గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో కత్రినా కైఫ్ పై పిల్లల విషయంలో కొన్ని ట్రోల్స్ వినిపిస్తున్నాయి.(Katrina Kaif)
Also Read: Samantha: అందరూ అనుకుందే జరిగింది.. రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్.?
అయితే కత్రినా కైఫ్ 2021లో నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరి పెళ్లి ఎంతో గ్రాండ్గా జరిగింది. అయితే పెళ్ళై ఇన్ని రోజులు అవుతున్నా కూడా పిల్లలు పుట్టకపోవడంతో అసలు కత్రినా కైఫ్ కి పిల్లలు పుడతారా లేదా ఈమె కంటే వెనక పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్స్ అందరూ పిల్లల్ని కని మళ్ళీ సినిమాల్లో రాణిస్తూ ఉంటే కత్రినా కైఫ్ ఇప్పటికి ఒక్కరిని కూడా కనకుండా ఇంకా వెనకబడే ఉంది అంటూ పిల్లల విషయంలో కత్రినా కైఫ్ ని ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాదు గత కొద్ది రోజులుగా పూజలు, వ్రతాలు అంటూ గుళ్ళ చుట్టూ తిరుగుతుంది.అలాగే రీసెంట్ గా పిల్లల కోసం వెళ్లే ఓ దేవాలయాన్ని కూడా సందర్శించింది.అంటే పిల్లల్ని కావాలి అని అనుకున్నప్పటికీ కత్రినా కైఫ్ కి పిల్లలు పుట్టడం లేదని,అందుకే గుళ్ళు గోపురాలు తిరుగుతుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మరికొంత మందేమో కత్రినా కైఫ్ కి అసలు పిల్లలు పుడతారో లేదో అని ఇష్టారీతిన ట్రోల్స్ చేయడంతో పిల్లల విషయంలో కత్రినా కైఫ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తనపై పిల్లల గురించి వచ్చే ఈ ట్రోల్స్ పై కత్రినా కైఫ్ ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి.(Katrina Kaif)