BRS: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ట్విస్ట్ ?
BRS: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగుతోంది. అత్యున్నత ధర్మాసనంలో ఫిరాయింపులపై వాడివేడిగా వాదనలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం.

Twist in the case of BRS MLAs who defected from the party
KTR: దేశాలు దాటినా పోలీసులను వదిలిపెట్టను ?
పార్టీ ఫిరాయింపులపై మొదట 18 మార్చి 2024 న స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని పేర్కొన్న సుందరం… మొదట ఫిర్యాదు చేశాక కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పారు. పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ కోసం లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారన్నారు.
Telangana: ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం ?
కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా ఒడిపోయి.. ఇపుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని చెప్పారు. కౌంటర్ల దాఖలుకు మరింత సమయం కోరారు ప్రతివాదులు. ప్రతివాదులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు… ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ప్రశ్నలు సంధించింది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలన్న సుప్రీం కోర్టు… ఈ కేసును వాయిదా వేసింది.
KCR: గజ్వేల్ లో పంచాయితీ…కేసీఆర్ సభ్యత్వం రద్దు కానుందా ?