KTR: తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగితే అందాల పోటీలా?
KTR: తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగితే అందాల పోటీలా? అంటూ ఆగ్రహించారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు అందాల పోటీలు అవసరం లేదని అసెంబ్లీ లో డిమాండ్ చేశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందాల పోటీల వలన ఉద్యోగాలు, ఆదాయం ఏ విధంగా వస్తుందో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.

KTR Counter On Miss India competition
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే గర్వకారణమైన అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసి బందీగా ఉంచిందన్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రూ. 46 కోట్ల ఫార్ములా-ఈతో ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు తెస్తే తప్పు అన్న ప్రభుత్వం.. రూ. 55 కోట్లతో అందాల పోటీలు నిర్వహిస్తుందని చెప్పారు.
Ashutosh Sharma: కాటేరమ్మ కొడుకును తప్పు చేసిన పంజాబ్ ?
తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. తాగునీళ్లు లేవు, సాగునీళ్లు లేవు అని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందాల పోటీలను నిర్వహిస్తున్నది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసెంబ్లీలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.
Lucknow Super Giants: శార్దుల్ ఠాకూర్ కు లక్నో ఆఫర్ ?