Aamir Khan: ఆ ఇద్దరు హీరోలు నా లైఫ్ నాశనం చేయాలని కుట్రలు చేశారు.?

Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గత కొద్ది రోజుల నుండి బీటౌన్ లో వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. దానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్ మూడో పెళ్లికి రెడీ అవ్వడమే.. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రీసెంట్ గా తన బర్త్డే సందర్భంగా గౌరీ స్ప్రాట్ ని పరిచయం చేశారు.అయితే గత 18 నెలల నుండి ఆమెతో అమీర్ ఖాన్ రిలేషన్ లో ఉన్నారట. ఇక గౌరీకి ఆరు సంవత్సరాల బాబు ఉన్నా సరే ఆమెతో రిలేషన్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారు.
Those two heroes conspired to ruin my life Aamir Khan shocking comments
అలా రెండు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చిన అమీర్ ఖాన్ మూడో పెళ్లికి కూడా రెడీ అయ్యారు. అయితే పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నకు ఈ వయసులో పెళ్లి ఏంటి అని సమాధానం ఇచ్చారు.కానీ గౌరీ తో సహజీవనం మాత్రం చేస్తానని తెలియజేశారు. ఇక గౌరీతో తన బంధాన్ని తన ఇద్దరు భార్యలతో పాటు పిల్లలు కూడా ఒప్పుకున్నట్టు అమీర్ ఖాన్ తెలియజేశారు. అలా మూడో పెళ్లి రూమర్స్ తో వార్తల్లో నిలిచిన అమీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఇద్దరు హీరోలు నా సినీ కెరియర్ పతనం అవ్వాలని కుట్రలు చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Aamir Khan)
Also Read: Samantha: అందరూ అనుకుందే జరిగింది.. రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్.?
మరి ఇంతకీ అమీర్ ఖాన్ సినీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆ ఇద్దరు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. అమీర్ ఖాన్ సినీ కెరియర్లో ది బెస్ట్ మూవీ దంగల్.2000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినీ హిస్టరీలో రికార్డ్ సృష్టించిన ఈ సినిమా కలెక్షన్స్ ని ఇప్పటివరకు ఏ సినిమా బీట్ చేయలేకపోయింది. ఇక రీసెంట్గా పుష్ప 2 మూవీ దగ్గరలోకి వెళ్లి ఆగిపోయింది.అలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 2000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా అంటే తనకి ఇష్టం లేదని, ఈ సినిమాలో నటించడం నాకు ఇష్టం లేదు అంటూ అమీర్ ఖాన్ చెప్పడం విచిత్రం.

రీసెంట్గా అమీర్ ఖాన్ నాకు దంగల్ సినిమాలో నటించడం ఇష్టం లేదు. కానీ నా సినీ కెరియర్ ముగించాలి అనే ఉద్దేశంతోనే సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్ లు ఇద్దరు ఈ సినిమా కథ నా దగ్గరకు వచ్చేలా పన్నాగం చేశారు అంటూ అమీర్ ఖాన్ మాట్లాడారు. అయితే మొదట ఈ కథ సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ దగ్గరికి వెళ్లిందట. కానీ వాళ్ళిద్దరూ రిజెక్ట్ చేసి అమీర్ ఖాన్ తో చేయమని సజ్జెస్ట్ చేశారట. అందుకే అమీర్ ఖాన్ అలా సరదాగా మాట్లాడారు.ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ నాలుగురు కూతుర్ల తండ్రి పాత్రలో నటించారు.కానీ ఈ సినిమా ఎంతో పెద్ద సంచలనం సృష్టించింది.(Aamir Khan)