Rama Naidu: ఆ హీరోయిన్ ని ఇష్టపడ్డ రామానాయుడు..ఎవరు లేనప్పుడు ఇంటికి పిలిచి..?

Rama Naidu: నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న మూవీ మొగల్ రామానాయుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ప్రస్తుతం ఆయన బతికి లేకపోయినప్పటికీ ఆయన గురించి ఎంతోమంది ఆయన సన్నిహితులు ఆయనతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.అలా రామానాయుడు గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పడంతో పాటు తన మీద రామానాయుడు ఇష్టం పెంచుకున్నారు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది నటి జయలలిత.
Rama Naidu liked that heroine
ఇక జయలలిత అనగానే అందరూ తమిళనాడు మాజీ దివంగత సీఎం జయలలిత అనుకుంటారు. ఎందుకంటే జయలలిత కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కానీ ఆ జయలలిత వేరు ఈ జయలలిత వేరు.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే సినిమాల్లో బామ్మ పాత్రలు సీరియల్స్ లో బామ్మ రోల్స్ చేస్తున్న జయలలిత. అయితే జయలలిత గతంలో తెలుగు,తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది.(Rama Naidu)
Also Read: Raghavendra Rao: రాఘవేంద్రరావుతో రాజమౌళి అన్నకి విభేదాలు..?
ముఖ్యంగా మలయాళంలో అడల్ట్ సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయిపోయింది. అలా ఐటెం సాంగ్స్, వ్యాంప్ పాత్రలకి జయలలితను అప్పట్లో ఎక్కువగా తీసుకునేవారు.అయితే అలాంటి జయలలిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిర్మాత రామానాయుడు కి నేనంటే చాలా ఇష్టం. ఆయన నన్ను చాలా ఇష్టపడేవారు.ఆయన తో నేను మాట్లాడితే ఆత్మీయంగా ఉంటుంది అని ప్రతిసారి అనేవారు.

అంతే కాదు నాకు ఫోన్ చేసి వీలున్నప్పుడల్లా ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళు నీతో మాట్లాడతా అని అడిగేవారు. అలా చాలాసార్లు రామానాయుడు నన్ను ఇంటికి పిలిచారు అంటూ నటి జయలలిత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా రామానాయుడుతో ఉన్న అనుబంధం గురించి జయలలిత ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడంతో ఈమె మాటలు నెట్టింట వైరల్గా మారాయి.(Rama Naidu)