IPL 2025: ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర.. గూస్ బంప్స్ రావాల్సిందే ?


IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 6 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగాయి. భారీ స్కోర్లు కూడా నమోదు అవుతున్నాయి.

New history in IPL 2025

ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో సరికొత్త రికార్డు నమోదు అయింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లో సగటున 3.9 బంతులకు ఫోర్, అలాగే 9.9 బంతులకు సిక్సర్ నమోదు కావడం జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన ఈ స్థాయిలో దూకుడుగా ఆడటం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.

Ipl 2025: పోరాడి ఓడిన గుజరాత్… పంజాబ్ రాత మార్చుతున్న అయ్యర్ ?

ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో కనీసం 20 పరుగులకు పైగా నమోదు అయిన ఓవర్లు 20 దాకా ఉన్నాయి అని బిసిసిఐ లెక్కలు చెబుతున్నాయి. ఇక ప్రారంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 286 పరుగులు చేసి… ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. దీంతో కచ్చితంగా ఈసారి 300 కు పైగా సన్రైజర్స్ స్కోర్ చేస్తుందని అందరూ అంటున్నారు.

Ashutosh Sharma: కాటేరమ్మ కొడుకును తప్పు చేసిన పంజాబ్ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *