Court Movie: ప్రేమలో పడ్డ కోర్టు మూవీ జోడి.. తెరవెనుక రొమాన్స్.?

Court Movie: రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని సమర్పించిన సినిమా కోర్ట్.. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 14న విడుదలైన కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది.ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది అని చెప్పుకోవచ్చు. అలా నాని ఇప్పటికే తన వాల్ పోస్టర్ బ్యానర్ పై చిన్న చిన్న సినిమాలు నిర్మించి అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు.అయితే అలాంటి నాని సమర్పించిన కోర్టు మూవీకి నాని స్వయంగా వచ్చి ప్రమోషన్స్ నిర్వహించారు.
Court Movie couple who fell in love
ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందే “కథలెన్నో చెప్పారు కవితల్ని రాసారు కాలాలు దాటారు యుద్ధాలు చేసారు ప్రేమలో తప్పులేదు ప్రేమలో ” అనే పాట మాత్రం చాలా పాపులర్ అయింది. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో సినిమాకి మంచి ప్రమోషన్స్ కూడా అయ్యాయి.అలా ఎక్కడికి వెళ్లినా కూడా ఈ పాట తో పాటు ఈ పాటలోని స్పెషల్ డాన్స్ ని హర్షవర్ధన్, శ్రీదేవి ఇద్దరు చేసి చూపిస్తూ సినిమాకి భారీ ప్రమోషన్స్ చేశారు. అలా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్టు మూవీలో శ్రీదేవి హర్ష రోషన్ లు కీలక పాత్రలో చేశారు. ( Court Movie)
Also Read :Ram Charan: రామ్ చరణ్ మీద మోజు పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి చేసుకోవాలని చూసి.?
ఇక ఈ సినిమా ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు. ఈ సినిమాలో హీరోయిన్ మేనమామ పాత్రలో శివాజీ హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి హీరోయిన్ తండ్రి చనిపోయిన పాత్రలో శ్రీహరి లను తీసుకున్నారు.అలా హిట్ కొట్టిన ఈ సినిమాలోని కాన్సెప్ట్ కి చాలామంది ఫిదా అయిపోయారు.ముఖ్యంగా 17 ఏళ్లలో ప్రేమ అనే విషయాన్ని ఈ సినిమాలో మెయిన్ గా చూపించారు. అలా మంచి హిట్ అయిన కోర్టు మూవీ లోని జోడి నిజ.జీవితంలో కూడా ప్రేమలో పడ్డారు అంటూ టాలీవుడ్ సినీ వర్గాల్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ కోర్టు మూవీలో నటించిన శ్రీదేవి, హర్ష రోషన్ఇద్దరూ స్క్రీన్ మీదే కాకుండా స్క్రీన్ బయట కూడా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది అనే రూమర్లు తెరమీద చక్కర్లు కొడుతున్నాయి.అయితే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు రూమర్లు నెట్టిట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు ప్రేమలో పడ్డారని భావిస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మీ కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఇలాంటి తెలిసి తెలియని ఏజ్ లో ప్రేమ దోమ అంటూ కెరియర్ని నాశనం చేసుకోకండి అంటూ సోషల్ మీడియా వేదికగా సజెషన్లు ఇస్తున్నారు నెటిజన్స్.( Court Movie)