Black Carrots: నల్ల క్యారెట్ తింటే 100 రోగాలకు చెక్ ?
Black Carrots: నల్ల క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా మార్కెట్లలో ఎర్ర క్యారెట్ అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నల్ల క్యారెట్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎర్ర క్యారెట్ కన్నా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందట. ఎర్ర క్యారెట్ లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడానికి నల్ల క్యారెట్ ఎంతగానో సహాయం చేస్తుంది. నల్ల క్యారెట్ లో విటమిన్ ఏ, బి6, ప్రోటీన్, ఫైబర్, బయోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నల్ల క్యారెట్లలో విటమిన్లు అధికంగా ఉంటాయి.

Eating black carrots can prevent 100 diseases
నల్ల క్యారెట్లు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సమస్యలు తొలగిపోతాయి. కంటి వ్యాధులను దూరం చేయడంలో నల్ల క్యారెట్ ఎంతగానో సహాయం చేస్తుంది. నల్ల క్యారెట్లను తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కేలరీల కంటెంట్ తక్కువగా ఉంటుంది. నల్ల క్యారెట్ తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సహాయం చేస్తుంది. నల్ల క్యారెట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
Jagan: జగన్ ఇంట తీవ్ర విషాదం ?
ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నల్ల క్యారెట్ తినడం వల్ల క్యాన్సర్ కణాలు తొలగిపోతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త కణాలు దెబ్బతినకుండా సహాయం చేయడంలో నల్ల క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది. వృద్ధాప్య సమస్యలను కూడా నివారించడంలో నల్ల క్యారెట్ ఎంతో మంచిది. ఇది చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను నివారిస్తుంది. జుట్టు రాలడం, చర్మ సమస్యలను నివారించడంలో నల్ల క్యారెట్ ఎంతగానో సహాయం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు మూడు సార్లు అయినా నల్ల క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు. నల్ల క్యారెట్ తో జ్యూస్, క్యారెట్ ఫ్రై, హల్వా ఇలా వివిధ రూపాలలో తయారుచేసుకొని తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.