Strawberries: ఎండాకాలంలో స్ట్రాబెరీ తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Strawberries: స్ట్రాబెరీ ఇది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిని చూడగానే ఆకర్షించే గుణం కలదు. ఎందుకంటే ఇది ఎర్రగా మెరుస్తూ ఉంటుంది. ఇది తినడానికి పుల్లపుల్లగా, కాస్త వగరుగా ఉండే పండు. కేవలం రంగు, రుచి మాత్రమే కాకుండా ఇది తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఒక కప్పు స్ట్రాబెరీ పండ్లలో 11 గ్రాముల పిండి పదార్థాలు, 10 గ్రాముల ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కేలరీలు అధికంగా ఉంటాయి. స్ట్రాబెరీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Impressive Health Benefits of Strawberries
రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో స్ట్రాబెరీ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఈ స్ట్రాబెరీ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్యలు తొలగిపోతాయి. స్ట్రాబెరీ తినడం వల్ల జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. శరీరంలో ఉన్న కొవ్వును తొలగించడంలో స్ట్రాబెరీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. బరువు తగ్గాలని అనుకునే వారికి స్ట్రాబెరీ పండు మంచి ఫ్రూట్. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి సమస్యలను నివారిస్తుంది. స్ట్రాబెరీలను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపడేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది. పిల్లలు, గర్భిణీలు, పెద్దలు, వృద్ధులు, అందరూ కూడా స్ట్రాబెరీ పండును తినవచ్చు. దీనిని ఇతర రూపంలో కాకుండా నేరుగా తిన్నట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎర్రగా నిగనిగలాడే ఈ పండు తినడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల మెదడు వాపులను తగ్గిస్తాయి. అలాగే వయసు రిత్యా వచ్చే మతిమరుపులను కూడా నివారిస్తాయి. ఇందులో ఉండే పోలేట్, విటమిన్స్, ఫ్లేవనాయుడ్లు క్యాన్సర్ వ్యాధి రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న స్ట్రాబెరీ పండును తిన్నట్లయితే ఎన్నో రకాల వ్యాధులను తరిమికొడతాయని పోషకాహార నిపుణులు సూచనలు చేస్తున్నారు.