Naga Vamsi: హీరోయిన్ తో ప్రొడ్యూసర్ నాగ వంశీ ఎఫైర్.. దుబాయ్ లో అడ్డంగా బుక్కయ్యాడుగా.?

Naga Vamsi: సినిమాలు నిర్మిస్తూ పలు వివాదాల్లో ఇరుక్కున్న నిర్మాత నాగ వంశీ అంటే తెలియని వారు ఉండరు.ఈయన తాను నిర్మించే ప్రతి సినిమాకి ప్రమోషన్స్ చేసే సమయంలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కున్నారు.ఆ మధ్య కాలంలో డాకు మహారాజ్ సినిమా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కంటే ఎన్నో రెట్లు గొప్పది అని చెప్పి చిరంజీవి అభిమానుల అగ్రహానికి గురయ్యారు. ఇలా పలు వివాదాల్లో ఇరుక్కున్నారు.
Producer Naga Vamsi affair with the heroine
అయితే అలాంటి ప్రొడ్యూసర్ నాగ వంశీ తాజాగా విడుదలైన మ్యాడ్ -2 మూవీకి కూడా నిర్మాతగా చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ వంశీకి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది. నిర్మాత నాగ వంశీ తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా యాంకర్ ఓ ప్రశ్న అడుగుతూ..మీకు ఆ హీరోయిన్ కి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. (Naga Vamsi)
Also Read: Ram Charan: ఉపాసన కానే కాదు.. చెర్రీ మనసు దోచిన హీరోయిన్ ఎవరంటే.?
ఇప్పటికే ఆ హీరోయిన్ తో మీరు తిరుమల తో పాటు దుబాయ్ లో కూడా కనిపించారు. అలా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ హీరోయిన్ కూడా రావడంతో మీరిద్దరూ ఎఫైర్ పెట్టుకున్నట్టు బయట టాక్ వినిపిస్తోంది నిజమేనా.. అని యాంకర్ అడగగా తిరుమలకు ఏదో అలా సడన్గా వెళ్లడం జరిగింది. అలాగే దుబాయ్ కి కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అది కూడా అనుకోకుండానే జరిగింది. కానీ దానికే ఏదో ఉంది ఇద్దరి మధ్య అనుకోవడం సరైనది కాదు.

అయినా నాకు సినిమా వాళ్ళను ఇంటర్వ్యూలు చేసే యాంకర్స్ ని ఫ్లర్ట్ చేయడానికే సమయం దొరకడం లేదు. ఇంకా హీరోయిన్స్ ని ఎక్కడ ఫ్లర్ట్ చేయాలి. అయినా కాలేజీ రోజుల్లో అయితే ఏదో కామన్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ తప్పు.వాటికి నేను దూరంగా ఉంటాను అంటూ నాగ వంశి చెప్పుకొచ్చారు. అయితే నాగ వంశీతో ఆ హీరోయిన్ తిరుమలలో అలాగే దుబాయ్ లో కనిపించింది నిజమే. కానీ అది నాగ వంశి అన్నట్లు యాక్సిడెంటల్ గా జరిగింది మాత్రమే. ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు.(Naga Vamsi)