Sreeleela: లవ్ కన్ఫామ్ చేసిన శ్రీలీల.. నువ్వే నా ప్రపంచం అంటూ పోస్ట్.?

Sreeleela: నటి శ్రీలీల ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.ఈ హీరోయిన్ నటించిన రాబిన్ హుడ్ మూవీ తాజాగా విడుదలైంది.అలాగే రవితేజ పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కూడా ఈ హీరోయిన్ చేస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాల్లో ఓకే చెప్పినట్టు సమాచారం.
Sreeleela confirmed her love
ఇక బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో నటిస్తున్న ఆషీకీ -3 టైటిల్ మీద వివాదం నెలకొనడంతో ఈ సినిమా టైటిల్ తీసేసి వేరే టైటిల్ పెట్టడానికి మేకర్స్ ఆలోచన చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ చేస్తుందని, వీరిద్దరూ త్వరలో ఒక్కటి కాబోతున్నారని రూమర్లు ఇండస్ట్రీని కుదిపేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అంతే కాదు శ్రీలీల అభిమానుల సైతం ఇవి నిజమే అని నమ్ముతున్నారు. (Sreeleela)
Also Read: Heroine: రెండేళ్లలో 3000 కోట్లు..అద్దె ఇంట్లో అమ్మానాన్న.. హీరోయిన్ కన్నీటి కష్టాలు.?
ఎందుకంటే కార్తీక్ ఆర్యన్ తల్లి తన ఇంటికి కోడలుగా ఒక డాక్టర్ రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పడంతో నిజంగానే శ్రీలీల కార్తీక్ ఆర్యన్ లు డేటింగ్ లో ఉన్నారు అని అందరూ కన్ఫామ్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా కార్తీక్ ఆర్యన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసిన శ్రీ లీల నువ్వే నా ప్రపంచం అంటూ తూ మేరీ జిందగీ హై అంటూ కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఉన్న ఫోటోతో పాటు ఈ విధంగా క్యాప్షన్ ఇచ్చింది.

ఇక శ్రీలీల పెట్టిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో శ్రీ లీల కార్తిక్ ఆర్యన్ తో ప్రేమ కన్ఫామ్ చేసిందని వీరిద్దరూ ప్రేమలో ఉన్నది నిజమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమందేమో షూటింగ్లో భాగంగా డార్జిలింగ్ లో ఉన్న ఫోటోని షేర్ చేసింది.అంతేగాని ఇద్దరి మధ్య ప్రేమగీమా ఏమీ లేదు అని కొట్టి పారేస్తున్నారు.(Sreeleela)